శివ కార్తికేయన్.. తమిళంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మొదలు పెట్టి స్టార్‌గా ఎదిగిన హీరో. తన జర్నీ గురించి తెలిస్తే సినిమా వాళ్లే కాదు.. వేరే రంగాల వాళ్లకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అతను ఒకప్పుడు విజయ్ టీవీలో వీడియో జాకీగా పని చేయడం విశేషం. అలాంటి నేపథ్యం నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రల్లోనే నటించాడు.
‘3’ మూవీలో ధనుష్ ఫ్రెండు పాత్రలో అతణ్ని చూడొచ్చు. మరి కొన్ని చిత్రాల్లో ఇలాంటి క్యారెక్టర్లే చేశాడు. ఆపై ధనుష్ నిర్మాణంలో ‘ఎదిరి నీచ్చిల్’ అనే సినిమాలో హీరోగా నటించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడు. రెండో చిత్రం ‘వరుత్త పడాద వాలిబర్ సంఘం’ (తెలుగులో కరెంటు తీగ) ఇంకా పెద్ద హిట్ అవడంతో శివ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత నిలకడగా విజయాలందుకుంటూ స్టార్‌గా ఎదిగాడు.
ఐతే ఇంత కాలం అందుకున్న విజయాలు వేరు. ఇప్పుడు ‘అమరన్’తో అందుకున్న విజయం వేరు. ఇప్పటిదాకా శివ అంటే మిడ్ రేంజ్ హీరో. తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 60-70 కోట్ల వసూళ్లు వచ్చేవి. ఇంకా పెద్ద సక్సెస్ అయితే వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేవాడు. ‘డాక్టర్’ సినిమా వంద కోట్ల వసూళ్లతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ ‘అమరన్’ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన రెండు వారాలకు కూడా ఈ సినిమా జోరు తగ్గట్లేదు. తమిళనాట హౌస్ ఫుల్ వసూళ్లతో సాగుతోంది.
‘అమరన్’ బాగా ఆడుతుండడంతో ‘కంగువ’ లాంటి భారీ చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు దొరకని పరిస్థితి. ‘అమరన్’ డ్రీమ్ థియేట్రికల్ రన్ చూసి ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ సక్సెస్‌తో శివకార్తికేయన్ రేంజే మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపై అతణ్ని మిడ్ రేంజ్ హీరోగా చూసే పరిస్థితి లేదు. ‘అమరన్’తో అతను టాప్ లీగ్ స్టార్లకు చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ఇలాంటి హిట్ ఇంకోటి కొట్టాడంటే అతణ్ని సూపర్ స్టార్లలో ఒకడిగా పరిగణించాల్సిందే.
This post was last modified on November 13, 2024 10:34 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…