Movie News

స్పిరిట్ అనుకున్న దానికన్నా వేగంగా

తీసింది మూడు సినిమాలే అయినా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ బాలీవుడ్ లో ఓ రేంజులో దూసుకుపోతోంది. టి సిరీస్ సంస్థ పట్టువదలకుండా ఇతన్ని నమ్ముకునే వందల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసిందంటేనే ఏ స్థాయిలో ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్న సందీప్ వంగా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవలే భూల్ భులయ్యా 3 ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పిన ప్రకారం స్పిరిట్ వేగంగా పూర్తయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది.

వీలైనంత వరకు ఆరు నెలలు టార్గెట్ గా పెట్టుకున్నారట. ప్రభాస్ కున్న వరస కమిట్ మెంట్ల దృష్ట్యా ఒకే దర్శకుడికి ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితి ఎంత మాత్రం లేదు. సుదీర్ఘంగా తీస్తూ పోతామంటే కుదరదు.

బాహుబలి, సాహో, రాధే శ్యామ్ తర్వాత ఇకపై ఆలస్యానికి చోటివ్వకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఇస్తానని అభిమానులకు హామీ ఇచ్చిన ప్రభాస్ దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నాడు. కొత్త ప్రాజెక్టులు గ్యాప్ లేకుండా సంతకం చేస్తున్నాడు. ది రాజా సాబ్, ఫౌజీలు నిర్మాణంలో ఉండగానే హోంబాలే ఫిలింస్ కి మూడు ప్యాన్ ఇండియా కమిట్మెంట్లు ఇచ్చేశాడు.

సో స్పిరిట్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసే అవసరం పడదు. సందీప్ వంగా సైతం ఇది అవ్వగానే యానిమల్ పార్క్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం రాసిన స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడో ఏడాది క్రితం అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.

పుష్ప 2 ది రూల్ రిలీజయ్యాక బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఉంటుంది కాబట్టి అది అయ్యేలోగా సందీప్ వంగా స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని ఇటు వచ్చేయొచ్చు. మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్ర చేయబోతున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ టెస్ట్ ని ఇటీవలే ఓకే చేశారని ఇన్ సైడ్ టాక్.

This post was last modified on November 12, 2024 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

4 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

25 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

50 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago