మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో అభిమానులు ఎదురు చూస్తున్న ఘట్టం జరిగిపోయింది. లక్నోలో జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో 90 సెకండ్ల టీజర్ ని రిలీజ్ చేశారు. నిన్న వచ్చిన చిన్న గ్లిమ్ప్స్ సోషల్ మీడియాని ఊపేసింది. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడంతో దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూడటం కోసం ఫ్యాన్స్ వెల్లువలా థియేటర్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్, బెంగళూరు సహా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ప్రీమియర్ చేశారు. ఎడిటింగ్ కోసం చెన్నైలో ఉండటం వల్ల దర్శకుడు శంకర్ మినహా ప్రధాన క్యాస్ట్ అండ్ క్రూ ఈవెంట్ కు హాజరయ్యింది.
నిమిషంన్నర నిడివి మొత్తం రామ్ చరణ్ తోనే నిండిపోయింది. కాలేజీ విద్యార్ధి, ఐఎఎస్ ఆఫీసర్ రామ్ నందన్, రైతు అప్పన్న మొత్తం మూడు గెటప్ లను రివీల్ చేశారు. మెయిన్ విలన్ ఎస్జె సూర్యతో పాటు శ్రీకాంత్, సునీల్, జయరాం, సముతిరఖనిలను ఒక్కో షాట్ లో వేగంగా చూపించారు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్ తో పాటు తనకో చిన్న డైలాగ్ ఉంది. చివర్లో రామ్ చరణ్ ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్ అనే మాట తప్ప ఇంకేదీ అనకుండా మొత్తం సన్నివేశాలతోనే నిండిపోయింది. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఒకే ఒక్కడు తరహా ట్రీట్ మెంట్ తో శంకర్ కట్ చేయించిన విధానం హైప్ మార్చేలా ఉంది.
విపరీతమైన జాప్యం వల్ల బజ్ విషయంలో కొంచెం హెచ్చుతగ్గులకు గురైన గేమ్ ఛేంజర్ లెక్కలు ఈ ఒక్క టీజర్ తో మారిపోయేలా ఉన్నాయి. ఆద్యంతం శంకర్ మార్కు విజువల్స్ తో పాటు రామ్ చరణ్ ని ఎలివేట్ చేసిన తీరు, గెటప్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరు ఛాయాగ్రహణం ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడటంతో చాలా గ్యాప్ తర్వాత ఒక కమర్షియల్ గ్రాండియర్ ని చూస్తున్న ఫీల్ కలిగించింది. ఇది మెయిన్ ట్రైలర్ కాదు కాబట్టి అసలైన కంటెంట్ కోసం ఇంకా ఎదురు చూడాల్సి ఉంటుంది. జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది.
This post was last modified on November 9, 2024 6:27 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…