తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ అధికారిక ముద్ర కోసం అభిమానులు ఎదురు చూశారు. ఇప్పుడది నెరవేరిపోయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తండేల్ డిసెంబర్ 20 అనుకున్నా కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని, కానీ ఈలోగా సంక్రాంతికి రిలీజవుతుందనే ప్రచారం కొందరు చేయడం ఆశ్చర్యపరిచిందని, అసలు ఎప్పుడూ ఆ ఆప్షనే పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చారు. పలువురు స్నేహితులు పండగ డేట్ సూచించినా కొన్ని క్యాలికులేషన్లకు లోబడి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
సో అక్కినేని ఫ్యాన్స్ భావించినట్టు తండేల్ అసలు సంక్రాంతికి రావాలని అనుకోనేలేదనే క్లారిటీ పూర్తిగా వచ్చేసింది. ఒకవేళ అలా చేసి ఉంటే రిస్క్ కూడా. ఎందుకంటే ఓపెనింగ్స్ తో పాటు టోటల్ రెవిన్యూని రామ్ చరణ్, వెంకటేష్, సందీప్ కిషన్, అజిత్ లతో పాటు పంచుకోవాల్సి వచ్చేది. పైగా థియేటర్ల కొరత ఖచ్చితంగా ఎదురయ్యేది. దానికన్నా సేఫ్ గా ఫిబ్రవరిని ఎంచుకోవడం తెలివైన ఎత్తుడని చెప్పాలి. ఉప్పెన, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, నేను లోకల్ లాంటివన్నీ ఈ నెలలో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఎలా చూసుకున్నా తండేల్ డెసిషన్ సరైనదేనని చెప్పాలి.
ఇక మూడు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్లకు తగినంత సమయం దొరుకుతుంది. తండేల్ నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింది. సాయిపల్లవి కాంబినేషన్ కావడంతో తమిళ, మలయాళం భాషల్లోనూ చాలా క్రేజ్ నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు వన్ అఫ్ ది బెస్ట్ ఆల్బమ్ గా ఉంటుందని అంతర్గతంగా వినిపిస్తోంది. జాలర్లు, సముద్రాలు, అందమైన ప్రేమకథ లాంటి అంశాలు తండేల్ ని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. దర్శకుడు చందూ మొండేటి సైతం ఇది బెస్ట్ డేట్ అయ్యే రెవిన్యూ వస్తుందని స్టేజి మీదే హామీ ఇచ్చారు.
This post was last modified on November 5, 2024 7:30 pm
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…