ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తుంటారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాక నాలుక కరుచుకుంటారు. కొందరేమో తమ వ్యాఖ్యలు తప్పు అని గ్రహించి బేషరతుగా క్షమాపణలు చెబుతారు. కొందరేమో తమ వ్యాఖ్యలను వక్రీకరించారని.. లేదా తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాము తప్పేమీ మాట్లాడలేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరేమో తాము ఎవరి గురించి అయితే వ్యతిరేకంగా మాట్లాడామో వాళ్ల మీద తమ ప్రేమను చాటే వేరే విషయాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు.
300 ఏళ్ల కిందట తమిళ రాజుల అంత:పురాల్లో సేవలు అందించడం కోసం వచ్చి తమిళనాట స్థిరపడ్డ వాళ్లే తెలుగు వాళ్లు అంటూ ఓ కార్యక్రమంలో అవాకులు చెవాకులు పేలిన తమిళ నటి కస్తూరి.. ఈ చివరి మార్గంలోనే ప్రయాణం చేస్తోంది. తన మెట్టిల్లు తెలుగని.. తాను తెలుగు కోడలిని అంటూ ఆమె తెలుగు పట్ల తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేసింది.
ఆల్రెడీ తన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన కస్తూరి.. ట్విట్టర్లోనూ పోస్ట్ పెట్టింది. “నిన్న తమిళులతో విభజన రాజకీయాలు చేసే వారి మోసాన్ని నేను బయటపెట్టాను. కానీ ఈ రోజు డీఎంకే నా తెలుగు అభిమానం మీద విష ప్రచారం చేస్తోంది. నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తోంది. నా మెట్టిల్లు తెలుగు. నాది తెలుగు కుటుంబం అని తెలియన ఈ వెధవలు కామెడీ చేస్తున్నారు.
ఈ హిందూ వ్యతిరేకులు చేస్తున్న పెద్ద కామెడీ ఏంటంటే.. ఆంధ్ర, తెలంగాణకు చెందిన తెలుగు సనాతన నాయకుల మీద వీళ్లకు ఉన్నట్లుండి ప్రేమ పుట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన గోబెల్స్, హిందూ వ్యతిరేక డీఎంకే నెట్‌వర్క్ చేస్తున్న తప్పుడు ప్రచారంలో పడి మోస పోవద్దని తెలుగు మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి అబద్ధాలకు ఆంధ్ర, తెలంగాణ ప్రజలు లొంగరని నాకు తెలుసు. తెలుగువారి పట్ల నా ప్రేమను, విధేయతను ఎవ్వరూ కించపరచలేరు. నాకు కుటుంబాన్ని, ప్రేమను ఇచ్చిన నేల అది” అని ఆమె పేర్కొంది.
కానీ కస్తూరి ఎంత మొత్తుకుంటున్నా.. సోషల్ మీడియాలో ఆమెపై దాడి ఆగట్లేదు. తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పకుండా తన మెట్టిల్లు తెలుగు అంటూ కవర్ చేయడం ఏంటని ఆమెను తప్పుబడుతన్నారు. కండకావరంతో కామెంట్స్ చేసి ఇప్పుడు తెలుగు పట్ల విధేయత అంటే ఏం లాభమని మండిపడుతున్నారు.
This post was last modified on November 5, 2024 3:05 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…