2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ మారిపోయి ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చేతికి వచ్చాక బడ్జెట్, స్కేల్ రెండూ అమాంతం పెరిగిపోయాయి. ఊహించని విధంగా రిషబ్ శెట్టిని ప్రధాన పాత్రకు తీసుకోవడంతో ఇంకా షూటింగ్ మొదలుకుండానే అంచనాలు పీక్స్ కు వెళ్లడం మొదలయ్యింది. థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టితో పాటు దగ్గుబాటి రానా ఉన్న ఫోటోని ఎక్స్ లో షేర్ చేయడంతో కొత్త ప్రశ్న తలెత్తుతోంది.
ఒకవేళ హనుమంతుడు రిషబ్ శెట్టి అయితే మరి రానా ఎవరు అనే సందేహం వస్తోంది కదూ. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దశకంఠుడు రావణాసురుడిగా రానాని ఎంచుకున్నట్టు తెలిసింది. ఇది అఫీషియల్ గా చెప్పింది కాకపోయినా అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం విశ్వసనీయంగా ఉంది. ఇది నిజమైతే పర్ఫెక్ట్ ఛాయస్ అని చెప్పాలి. రానా గంభీరమైన రూపం రావణుడికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. విగ్రహంతో పాటు గళం కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ఓ రేంజ్ లో పేలుతుంది. ఇక అసలైన ప్రశ్న హనుమంతుడు, రావణుడు అయ్యాక మరి రాముడు ఎవరనేది.
ఇంకా ఈ నిర్ణయం జరగలేదని అంటున్నారు. ప్రశాంత్ వర్మ ముందు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని పూర్తి చేయాలి. దాని తర్వాత జై హనుమాన్ ఉంటుంది. అయితే ఇంత వరసగా అప్డేట్స్ ఇవ్వడం వెనుక మర్మం ఏమిటో కొద్దిరోజులు ఆగితే కానీ స్పష్టత రాదు. ఇవి కాకుండా సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా వేరే దర్శకురాలితో మహాకాళి లాంటి ప్యాన్ ఇండియా సినిమాను ఇప్పటికే ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను ఎలా బ్యాలన్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 2025లో రిషబ్ శెట్టి కాంతార పార్ట్ 2 విడుదల కానుండగా ఆపై 2026లో జై హనుమాన్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 4, 2024 5:24 pm
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…