ఇంకో నెల రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ కు సంబంధించి బ్యాలన్స్ ఉన్న వాటిలో అతి ముఖ్యమైంది ఐటెం కం స్పెషల్ సాంగ్. దర్శకుడు సుకుమార్ ఈ పాటలో నర్తించేందుకు సరైన భామ కోసం చేసిన సుదీర్ఘమైన వేట ఎట్టకేలకు ముగింపుకొచ్చిందని ఫిలింనగర్ టాక్. శ్రీలీల, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక అద్భుతమైన మాస్ నెంబర్ ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజింగ్ లో చూడొచ్చని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఒప్పందాలు అయ్యాయని వినికిడి. పుష్ప 1 ది రూల్ కు సైతం సమంత ఉన్న సంగతి చాలా ఆలస్యంగా బయటికొచ్చింది.
సో ఇది నిజమైతే బన్నీ అభిమానులకు ఇంత కన్నా గుడ్ న్యూస్ ఉండదు. ఈ సంవత్సరం టాప్ డాన్సింగ్ నెంబర్ గా యునానిమస్ గా నిలిచింది గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి. దాంట్లో శ్రీలీల వేసిన స్టెప్పులు, చూపించి చూపించకుండా ఒలికించిన హొయలు మాస్ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి. మహేష్ బాబుకే రెట్టింపు ఉత్సాహం తెప్పించి స్క్రీన్లను ఊపేసిన శ్రీలీల ఇప్పుడు ఐకాన్ స్టార్ తో జోడి కడితే జరిగే భీభత్సం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. కొరియోగ్రఫీకి తొలుత జానీ మాస్టర్ అనుకున్నారు కానీ తాజాగా ఇప్పుడా స్థానంలో ప్రేమ్ రక్షిత్ వచ్చారని ఇన్ సైడ్ న్యూస్. అఫీషియల్ కాలేదు.
అసలైన లాంఛనం పూర్తవ్వబోతోంది కాబట్టి పుష్ప 2 ది రూల్ కు సంబంధించి అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్టే. అన్నట్టు ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీలీలతో పాటు సమంతా ఉండొచ్చని అంటున్నారు కానీ నిర్ధారణగా తెలియదు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలుపెట్టిన పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో దేవర తరహాలో ముందు రోజు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలకు రంగం సిద్ధం చేస్తోంది. బిజినెస్ పరంగా ఇప్పటికే కనివిని ఎరుగని ఆఫర్లతో ట్రేడ్ మతులు పోగొడుతున్న పుష్ప 2 అటు ఉత్తరాదిలోనూ అంతే సంచలనం నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డీల్ చేస్తున్న రేట్లు అలా ఉన్నాయి మరి.
This post was last modified on November 2, 2024 10:34 am
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…