టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు. మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న నాని మళ్ళీ 2025 మే 1న థియేటర్స్ లోకి రానున్నాడు. ఇక నాని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదేలతో మరో సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని 2026 ప్రథమార్ధంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
అలాగే సుజిత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ అంగీకరించిన నాని, పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘ఓజీ’ విడుదల తర్వాత సుజిత్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందు శివ నిర్వాణతో మరోసారి కలసి సినిమా పూర్తి చేయాలని నాని చర్చిస్తున్నట్లు టాక్. ఈ సినిమా షెడ్యూల్ కేవలం 3 నెలల్లో పూర్తిచేయాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కథతో ఉండనున్నట్లు సమాచారం.
నాని, శివ నిర్వాణ కలయిక తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమే, ఎందుకంటే వీరి కలయికలో వచ్చిన ‘నిన్నుకోరి’ మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ‘టక్ జగదీశ్’OTT లో రాగా పెద్దగా క్లిక్కవ్వలేదు. శివ నిర్వాణ రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ యావరేజ్ గా నిలిచింది. అలాగే అతను నాగచైతన్యతో కూడా ఒక సినిమా అనుకున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా నానితో శివ నిర్వాణ మరో క్లాస్ టచ్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
This post was last modified on November 1, 2024 2:58 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…