Movie News

దిల్ రాజు రాయబారం ఫలించలేదా

2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు వెంకటేష్ 76 రిలీజ్ చేయాలనే ఒత్తిడి నిర్మాత దిల్ రాజు మీద పెరుగుతోంది. వెంకీ, దర్శకుడు అనిల్ రావిపూడి ఎట్టి పరిస్థితుల్లో పండగ మిస్ చేయకూడదనే సంకల్పంతో ఉండగా, రాజుగారికేమో రామ్ చరణ్ సినిమాతో పాటు బాలయ్య 109 పంపిణి బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉండటంతో అంత సుముఖంగా లేరనే టాక్ ముందు నుంచి ఉంది. అందుకే ఎలాగైనా వెంకటేష్ ని ఒప్పించే దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఫిలిం నగర్ టాక్. అందుకే నిన్న డబ్బింగ్ కు సంబంధించిన ట్వీట్ లో వెంకటేష్ సంక్రాంతికి కలుద్దాం అంటే ఎస్విసి హ్యాండిల్ లో మాత్రం డేట్ ప్రస్తావన లేదు.

సో ఇంకా సస్పెన్స్ అయిపోలేదన్న మాట. ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందని గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో మైత్రి మూవీ మేకర్స్ నిరూపించారు. అప్పుడు వారసుడు, తెగింపు లాంటి పోటీ ఉన్నా సరే భారీ వసూళ్లు లాగేశారు. ఇప్పుడూ అదే జరగొచ్చని వెంకీ ఫ్యాన్స్ నమ్మకం. అయితే కమర్షియల్ క్యాలికులేషన్లు వేసుకుంటున్న దిల్ రాజు ఒకటే వస్తే అది కూడా గేమ్ ఛేంజర్ అయితేనే ఎక్కువ ప్రయోజనమన్న కోణంలో ఆలోచిస్తున్నారట. చివరి నిమిషం దాకా ట్రై చేసి అవ్వకపోతే వెంకీ ఆకాంక్షకే కట్టుబడతారన్న మాట.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని వెంకటేష్ సినిమా టైటిల్ కోసం ఇల్లాలు ప్రియురాలు పదాలు వచ్చేలోగా పలు ఆప్షన్లు చూస్తున్నారట. సంక్రాంతి వస్తున్నాంని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఇప్పుడు దాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారని తెలిసింది. ఐశ్వర్య రాజేష్ భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ లవర్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కి బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. ఎఫ్2, ఎఫ్3 లాగా మల్టీస్టారర్ కాకపోవడంతో వినోదం పండించే పూర్తి బాధ్యత వెంకటేష్ మీదే పడింది. దానికి వందకు రెండు వందల శాతం న్యాయం చేశారని యూనిట్ టాక్. ఇంకో రెండు రోజుల్లో దీపావళి కాబట్టి ఫైనల్ క్లారిటీ వచ్చేస్తుంది.

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

24 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago