గుంటూరు కారం తర్వాత మహేష్ బాబుని మళ్ళీ తెరమీద చూడలేమని బెంగపడుతున్న అభిమానులను రిలీఫ్ దక్కే శుభవార్త రాబోతోందట. అశోక్ గల్లా హీరోగా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవకీనందన వాసుదేవలో మహేష్ జస్ట్ అలా కాసేపు కనిపించే చిన్న క్యామియో చేశాడనే లీక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు కానీ నమ్మదగిన సోర్స్ నుంచి వస్తున్న సమాచారం చాలా ధీమాగా చెబుతోంది. దీనికి సంబంధించిన షూట్ రెండు నెలల క్రితమే పూర్తి చేశారని, రాజమౌళి ఆమోద ముద్ర పడిందని అంటున్నారు.
ఇది నిజమైతే మాత్రం దేవకీనందన వాసుదేవ మీద ఇప్పటిదాకా లేని బజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. హీరో ద్వారా లాంచ్ అయిన అశోక్ గల్లా ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథలో సరైన మోతాదులో కుటుంబ అంశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు చిన్న డివోషనల్ టచ్ ఉండటం వల్ల ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైతే ప్రమోషన్లు మొదలుపెట్టలేదు కానీ దీపావళి నుంచి పబ్లిసిటీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారని తెలిసింది. హనుమాన్ పుణ్యమాని కథ ఇచ్చిన ప్రశాంత్ వర్మ పేరు మీదే ఎక్కువ మార్కెట్ చేస్తున్నారు.
కంగువతో పోటీకి సిద్ధపడ్డ దేవకీనందన వాసుదేవకు సంబంధించి కథా కమామీషు ఇంకా పూర్తిగా బయటికి వదల్లేదు. టీజర్ లో క్లూస్ ఇచ్చారు తప్పించి ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ టాక్ బయటికి రాగానే ఒక్కసారిగా ఎక్కడ లేని ఆసక్తి మొదలువుతుంది. కంగున, వరుణ్ తేజ్ మట్కాలతో పోటీకి సిద్ధపడుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మహేష్ బాబు క్యామియో ఉంటే మాత్రం దానివల్ల కలిగే లాభం అంతా ఇంతా ఉండదు. కాకపోతే మితిమీరి ఊహించుకోకుండా పరిమితంగా ఎక్స్ పెక్ట్ చేయడం బెటర్. ఎందుకంటే కేవలం అతి కొంత సేపు అది కూడా డైలాగు లేకుండా శ్రీకృష్ణుడిగా మహేష్ కనిపిస్తాడని వినికిడి.
This post was last modified on October 28, 2024 3:30 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…