తమిళనాడులో సరైన థియేటర్లు దొరకని కారణంగా కిరణ్ అబ్బవరం ‘క’ని అక్కడ వారం రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అమరన్, బ్రదర్ లాంటి పెద్ద సినిమాలు ఉండటం వల్ల సరిపడా స్క్రీన్లు ఇవ్వలేమని కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. కానీ మన దగ్గర మాత్రం అమరన్ కు స్వాగతం పలుకుతున్నారు. పంపిణి పరంగా పేరొందిన సంస్థలే అండదండలు అందిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. కనీసం టైటిల్స్ మార్చకుండా యధాతథంగా తమిళ పేర్లు పెట్టడం పట్ల నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ధోరణిలో మార్పు లేదు.
సరే ఇదంతా కాసేపు పక్కనపెడితే చిరంజీవి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. 2022లో గాడ్ ఫాదర్ రిలీజైన సమయంలోనూ ఇదే సమస్య వచ్చింది. దీనికి సరిగ్గా వారం ముందు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 వచ్చింది. హిట్ టాక్ రావడంతో భారీ ఎత్తున సెకండ్ వీక్ థియేటర్లను కొనసాగించారు. దీంతో మెగాస్టార్ కు స్క్రీన్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేయడంతో తెలుగు వెర్షన్ అక్టోబర్ 5 వస్తే చాలా చోట్ల తమిళంలో అక్టోబర్ 14 వదలాల్సి వచ్చింది. అంత పెద్ద స్టార్ చిరంజీవికే ఇబ్బంది తప్పనప్పుడు కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ హీరోకు గ్రాండ్ వెల్కమ్ చెబుతారని ఎలా అనుకుంటాం.
ఏది ఏమైనా ఈ పద్దతిలో మార్పు రావాలి. మనమేమో వాళ్ళ సినిమాలను నెత్తిన బెట్టుకుంటే అక్కడేమో కనీసం డబ్బింగులుకు కాసిన్ని స్క్రీన్లు ఇవ్వడానికి కూడా బెట్టు చేస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా పండగ ఏదైనా సరే ఎంత టైట్ ఉన్నా సరే సర్దుబాటు అనేది మనవైపు నుంచి ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అజిత్, విజయ్, విక్రమ్, కార్తీ ఇలా భేదం లేకుండా అందరికీ ఆదరణ ఇస్తున్నాం. కానీ ఇందులో కనీసం సగమైనా టాలీవుడ్ మీద చూపించాలి కదా అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. పెద్దలు పూనుకుంటే తప్ప పరిష్కారం కానిది ఇది. కానీ ఆ సూచనలు కనుచూపుమేరలో లేవు. ఎప్పటికైనా జరిగేనా.
This post was last modified on October 23, 2024 11:30 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…