ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఏ పెద్ద స్టార్ సినిమాకూ యునానమస్ పాజిటివ్ టాక్ రాదని.. సోషల్ మీడియాలో పెరిగిపోయిన నెగెటివిటీ కారణంగా ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ తప్పదని.. దాన్ని తట్టుకుని నిలబడే మార్గం చూడాలని వ్యాఖ్యానించాడు.
ఆయన మాటల్లో అతిశయోక్తి లేదనిపిస్తుంది. యుఎస్ ప్రిమియర్స్ నుంచి చాలా సినిమాలకు డివైడ్ టాకే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యుఎస్ ప్రిమియర్స్‌తో పాటుగా స్పెషల్ షోలు పడిపోతున్నాయి. ఆ షోల నుంచి పూర్తి పాజిటివ్ టాక్ అయితే రావట్లేదు. బాగున్న సినిమాల గురించి కూడా నెగెటివ్ పోస్టులు కనిపిస్తున్నాయి.
యావరేజ్ సినిమాలను డిజాస్టర్లుగా పేర్కొంటున్నారు. పెద్ద హిట్టయిన కల్కి, సలార్ చిత్రాలకు కూడా కొంచెం మిక్స్డ్ టాకే వచ్చింది. కానీ ఓవరాల్‌గా అవి విషయం ఉన్న సినిమాలే కావడంతో ఆ టాక్‌ను తట్టుకుని నిలబడి భారీ వసూళ్లు సాధించాయి. ఐతే ప్రభాస్ స్టార్ పవర్ వేరే లెవెల్ కాబట్టి ఆ చిత్రాల మీద నెగెటివ్ ఎఫెక్ట్ పెద్దగా పడలేదు.
ఇక వర్తమానంలోకి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’కు మిడ్ నైట్ షోలు పూర్తయ్యే సమయానికి బాగా నెగెటివిటీ కనిపించింది. ఇది ఇంకో ఆచార్య అన్నట్లుగా పోస్టులు కనిపించాయి. ఎక్కువగా నెగెటివ్ పోస్టులు దర్శనమివ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడగలదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘దేవర’ ఆ నెగెటివిటీని బాగానే ఎదుర్కొంది.
వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజీతో బాక్సాఫీస్ గండాన్ని దాాటేసింది. మేకర్స్ ప్రకటించిన స్థాయిలో వసూళ్లు లేవు, ఇది బ్లాక్ బస్టర్ కూడా కాదు కానీ.. అంతిమంగా హిట్ మూవీగా నిలిచింది. ఇది తారక్‌కు, అభిమానులకు ఎంతో ఊరటనిచ్చే విషయం.
ఇక టాలీవుడ్ నుంచి రాబోయే నెక్ట్స్ బిగ్ రిలీజ్ ‘పుష్స-2’ పరిస్థితి ఏమవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ సినిమా అంటే ఆషామషీగా ఉండదు. ఆయన ఈసారి మరింత టైం, ఎఫర్ట్ పెట్టారు.
ఐతే రకరకాల కారణాల వల్ల అల్లు అర్జున్ మీద పెరిగిన నెగెటివిటీ వల్ల పుష్ప-2ను టార్గెట్ చేయడానికి ఒక వర్గం కాచుకుని ఉంది. సినిమా ఎలా ఉన్నా నెగెటివిటీ తప్పకపోవచ్చు. ‘దేవర’ తరహాలోనే ‘పుష్ప-2’ కూడా ఆ నెగెటివిటీని జయించి బాక్సాఫీస్ దగ్గర జయకేతనం ఎగురవేస్తుందేమో చూడాలి.
This post was last modified on October 18, 2024 9:29 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…