టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ నిర్మాతలు ఉన్నా కూడా అందులో డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేసే వారిలో దిల్ రాజు ముందుంటారు. ఒకప్పుడు కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు మాత్రం సీనియర్ దర్శకులతోనూ భారీ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజు గారికి కనెక్ట్ అయితే ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతో కూడా మరోసారి సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు.
గతంలో మున్నా సినిమాతో సక్సెస్ కాలేకపోయిన వంశీ పైడిపల్లికి బృందావనంతో ఛాన్స్ ఇచ్చి ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఇక వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ తో విఫలమైనా అతనికి MCAతో మరో అవకాశం ఇచ్చి లైన్ లోకి తెచ్చాడు. ఆ లిస్టులో జోష్ వాసువర్మ కూడా ఉన్నాడు. కాకపోతే అతను కృష్ణాష్టమి తో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఫ్లాప్ అందుకున్న మరో దర్శకుడితో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ దర్శకుడు మరెవరో కాదు, ఫ్యామిలీ స్టార్ తో ఊహించని షాక్ ఇచ్చిన పరశురామ్. మంచి టాలెంటెడ్ దర్శకుడు అయినప్పటికీ గీతగోవిందం తరువాత అతని ట్రాక్ మళ్ళీ తప్పినట్లు అనిపిస్తోంది. ఇక దిల్ రాజు సలహా మేరకు మరో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. హీరో ఎవరు అనే విషయంలో మరికొన్ని గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. మొదటి ఛాయిస్ గా నవీన్ పోలిశెట్టిని అనుకున్నారట. కానీ ఎందుకో అతనుసెట్టవ్వలేదని టాక్.
ఇక DJ టిల్లు సిద్ధు జొన్నలగడ్డను ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. చాలా కాలంగా సిద్ధు తో కూడా దిల్ రాజు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే పరశురామ్ కు కూడా ఫ్యామిలీ స్టార్ టైమ్ లోనే మరో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఫైనల్ గా రాజుగారు ఒక న్యూ కాంబినేషన్ లో అయితే డిఫరెంట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి దర్శకుడు ఈసారి ఎలాంటి కంటెంట్ తో వస్తాడో చూడాలి.
This post was last modified on October 16, 2024 3:56 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…