2025 సంక్రాంతి సినిమాల విడుదల ప్రహసనం ఏ సస్పెన్స్ థ్రిల్లర్ కు తీసిపోని రీతిలో జరుగుతోంది. ముందు వస్తామని చెప్పిన విశ్వంభర ఏకంగా అయిదు నెలలు వాయిదా వేసుకునే పనిలో ఉంది. క్రిస్మస్ రిలీజని ప్రచారమైన గేమ్ ఛేంజర్ ఇప్పుడు దాని స్థానంలో రావడం మెగా ఫ్యాన్స్ కి కొంత సంతోషాన్ని కొంత బాధని మిగిల్చింది. బాలయ్య 109 టైటిల్ నిర్ణయం జరగ్గానే డేట్ ని లాక్ చేస్తారు. జనవరి 12 ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చింది కానీ అఫీషియల్ స్టాంప్ లేదు. తండేల్ ని పండక్కు తేవాలా వద్దానే మీమాంసలో అల్లు అరవింద్, బన్నీ వాస్ ఉన్నారు. ఇది మిస్ అయితే రిపబ్లిక్ డే టార్గెటవుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే పక్కా ప్లానింగ్ తో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న వెంకటేష్ – దర్శకుడు అనిల్ రావిపూడిల సినిమాని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. ఇది ఖరారుగా చెప్పకపోయినా లీకు రూపంలో బయటికి రావడంతో వెంకీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్యానర్ నుంచే గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ వస్తున్నప్పుడు కేవలం రెండు మూడు రోజుల గ్యాప్ లో వెంకటేష్ సినిమా తేవడం ఎంతవరకు సబబనే కోణంలో రాజుగారు నిర్ణయం మార్చుకోవచ్చని అంటున్నారు. దీనికి అనుకున్న టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం.
సో ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు ఎవరు తప్పుకుంటారనేది ఖచ్చితంగా చెప్పలేం. ఇంకా సందీప్ కిషన్ మజాకాతో పాటు బెల్లకొండ సాయిశ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ చేస్తున్న గరుడన్ రీమేక్ కూడా సంక్రాంతికేననే ప్రచారం ఊపందుకుంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ డేట్ గురించి తమిళ వర్గాల్లో పొంగలనే చెబుతున్నారు. మరి వెంకటేష్ తప్పుకునేందుకు ఒప్పుకుంటారానే ప్రశ్న ఉత్పన్నం కాదు. నిర్మాత నిర్ణయానికి గౌరవమిచ్చే వెంకీ ఒకవేళ దిల్ రాజు నిజంగా అడిగితే మీ ఇష్టమనే అంటారు తప్ప మొండిపట్టు పట్టరు. చివరికి ఈ రిలీజుల ప్లానింగ్ లో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతోందో.
This post was last modified on October 16, 2024 12:43 pm
నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా…
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…