సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది. ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రమే దీన్ని ఇస్తారు. అయితే వాటిలో ఎక్కువగా చక్కెర పూసిన సోంపును అందిస్తారు, ఇవి ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడవు. కానీ సహజ సోంపు గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జీర్ణవ్యవస్థకు మేలు
భోజనం తిన్న తర్వాత సోంపు నమలడం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి ఆహారం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది, అటువంటి వారు సోంపు తింటే మంచి ఫలితం పొందగలరు. సోంపులోని సహజ పదార్థాలు పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
సోంపులో తక్కువ కేలరీలు ఉంటాయి, అయితే ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచి, అవసరానికి మించి తినకుండా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఉదయం, సాయంత్రం నీటిలో కాస్త సోంపు వేసి మరిగించి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించడంలో సహాయపడుతుంది.
ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం
ఆహారం తిన్న వెంటనే కొంతమంది గ్యాస్, ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారు సోంపును నమలడం వల్ల ఎసిడిటీ తగ్గించుకోవచ్చు. సోంపులో సహజంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో మంటను తగ్గించి.. ఉదర సంబంధిత అన్ని సమస్యలను నివారిస్తాయి.
నోటి దుర్వాసనను తగ్గిస్తుంది
సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. సోంపులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటిలో పెరిగే హానికర బ్యాక్టీరియాను అణచివేస్తాయి. అలాగే, సోంపు నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది. అందువల్ల, సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించుకోవచ్చు.
రక్తపోటు నియంత్రణ
సోంపులో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడి, హై బ్లడ్ ప్రెజర్ సమస్యను తగ్గిస్తుంది. సోంపులోని నైట్రేట్ రక్తనాళాలను విస్తరించేందుకు సహాయపడటంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
సోంపు నీటిని మరిగించి రోజూ ఉదయం, రాత్రి తాగితే మెథబోయిస్ అన్ని పెంచడంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది.చక్కెర కోటింగ్ తో ఉండే సోంపు కంటే కూడా సహజంగా లభించే సోంపును తీసుకోవడం మంచిది. సోంపు రోజు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది.
గమనిక:
పైన అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates