ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే మన చేతుల్లోకి కోరుకున్న ఆహారం అందుతుంది. ఇటువంటి ఆహారాల్లో ముఖ్యంగా మాంసాహారం ప్రాధాన్యత ఎక్కువ. జొమాటో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీని ప్రజలు అధికంగా ఆర్డర్ చేస్తున్నారు. అయితే, చికెన్, మటన్ తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మాంసాహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు
1. గుండె జబ్బులు :
ఎర్ర మాంసంలో అధికంగా ఉండే సంతృప్త కొవ్వు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతుంది.
2. క్యాన్సర్ ముప్పు :
కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎర్ర మాంసం అధికంగా తీసుకునే వారిలో ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి.
3. టైప్ 2 డయాబెటిస్ :
ఎర్ర మాంసం రక్తంలో చక్కెర స్థాయిని పెంచి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
4. జీర్ణక్రియ సమస్యలు :
కొందరికి మాంసం జీర్ణమవడం కష్టమవుతుంది. దీని కారణంగా అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.
మాంసంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కానీ, ఈ మాంసాన్ని సమతుల ఆహారంలో భాగంగా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కొవ్వు తక్కువగా ఉండే మాంసాన్ని ఎంచుకోవడం మంచిది. మాంసం ప్రాధాన్యం తగ్గించి, చేపలు, గుడ్లు, బీన్స్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను ఆకళింపు చేసుకోవచ్చు. మన డైట్ లో ఎక్కువ శాతం జీర్ణానికి సులువుగా ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారం శరీరానికి రోజువారి అవసరమయ్యే ప్రోటీన్, విటమిన్స్ అందించే విధంగా బ్యాలెన్స్ గా ఉండాలి.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శాకాహారులు మాంసాహారంలో లభించే పోషకాలను కూరగాయల ద్వారా పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి. మాంసాహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే, దీన్ని నియంత్రణలో ఉంచి, శాకాహారంతో సమతుల ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
గమనిక:
పైన అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ వైద్యులను సంప్రదించడం మంచిది.
This post was last modified on January 3, 2025 7:33 am
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…