ప్రస్తుతం బరువు తగ్గడం అనేది చాలామందిని వేధిస్తున్న ఓ పెద్ద సమస్య. మనం తీసుకునే ఆహారం, స్ట్రెస్ , లైఫ్ స్టైల్.. ఇలా బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గంటల తరబడి ఎక్ససైజ్లు చేసే సమయం అందరి దగ్గర ఉండదు. పైగా ఉద్యోగం చేసే వాళ్ళకి డైటింగ్, ఎక్ససైజ్ లాంటివి చేయాలి అంటే అస్సలు కుదరదు. ఇలాంటి వారి కోసమే బరువుని సులభంగా తగ్గించే ఈ వాటర్ థెరపీ.
మనలో చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కొంతమంది బరువు ఇలా తగ్గి మళ్ళీ వెంటనే అలా పెరిగిపోతూ ఉంటారు. కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగితే బరువు తగ్గిపోతాం అనే అపోహతో విపరీతంగా నీళ్లు తాగుతారు. అలాంటి వారు తగ్గడం సరి కదా ఇంకాస్త బరువు పెరుగుతారు.. ఎందుకంటే నీళ్లు తాగితే బరువు తగ్గుతారు అన్న మాట వాస్తవమే.. కానీ దాన్ని తాగడానికి కూడా ఓ పద్ధతి ఉంది. దాన్నే వాటర్ థెరపీ అంటారు.. మరి వాటర్ తో మనం బాడీ వెయిట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం పదండి..
చాలామందికి తరచుగా ఆకలి వేస్తుంది.. ఒక గంట క్రితం బాగా తిన్నప్పటికీ సడన్గా ఎందుకో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అయితే అది నిజంగా ఆకలి కాదు.. అలాంటప్పుడు ఓ గ్లాసు నీళ్లు తాగడం వల్ల మనకు కడుపు నిండినట్టుగా ఉండడమే కాకుండా అధిక కేలరీలు తీసుకోకుండా ఉంటాం. అయితే గ్లాసులకొద్దీ నీళ్లు ఒకేసారి తాగకూడదు.. కాస్త నెమ్మదిగా మెల్లిమెల్లిగా నీళ్లు తీసుకోవాలి.
పొద్దున నిద్రలేచినప్పుడు గోరు వెచ్చటి నీళ్ళు ఓ రెండు గ్లాసులు తీసుకొని.. ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల కడుపులోని మలినాలు శుభ్రపడతాయి. అలాగే మీరు భోజనం చేయడానికి ప్రతిసారి అరగంట ముందు ఓ గ్లాసు నీళ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం తీసుకునే ఆహారంపై మనకు నియంత్రణ ఉంటుంది. అలాగే రాత్రిపూట ఎక్కువగా నీరు తాగకూడదు.
చాలామంది వాటర్ బదులు జ్యూస్ తీసుకున్న సరిపోతుంది అనుకుంటారు…అది కేవలం అపోహ మాత్రమే. ఇలా తరచూ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయే తప్ప మనం బరువు మాత్రం తగ్గడం జరగదు. అలాగే వీలైనప్పుడల్లా చల్లటి నీటి బదులు గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి. మనం గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల పేగులలో ఉన్న మలినాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.. జీవక్రియ మెరుగవ్వడంతో మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా కొవ్వుగా కన్వర్ట్ కాకుండా ఉంటుంది.
మీకు ఎక్కువగా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ లేదా ఏదైనా జంక్ ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు కాస్త నీళ్లు తాగి చూడండి.. వెంటనే ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. నీరు మంచిది కదా అని అదే పనిగా తాగినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువ నీరు తీసుకున్న వారికి కొన్నిసార్లు వాంతులు ,విరోచనాలు కూడా అవుతాయి.. కాబట్టి రోజుకి ఓ నాలుగు లీటర్ల వరకు నీరు తీసుకోవచ్చు. కానీ మనం నీరు తీసుకునే విధానంలో చేసే చిన్న చిన్న మార్పుల వల్ల చక్కటి ఫలితాన్ని అందుకుంటాము.
గమనిక: పైన అందించిన సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించేటప్పుడు ఒకసారి మీ డాక్టర్ లేక న్యూట్రిషన్ ని సంప్రదించడం మంచిది.