మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమాలను పట్టాలెక్కించాడు. వీటి తర్వాత బాబీతో చిరు తన 154వ సినిమాను చేయనున్నాడు. `మెగా 154` వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాది గ్రాండ్‌గా ఈ మూవీ ప్రారంభమైంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా ఊరమాస్ గెటప్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బాబీ ఈ సినిమా టైటిల్‌ను ఛేంజ్ చేశారట. వాల్తేరు వీరయ్య కాకుండా `వాల్తేరు మొనగాడు` అనే టైటిల్ ఇంకా బెటర్‌గా ఉందని బాబీ భావించారట. చిరంజీవికి సైతం ఆ టైటిల్ నచ్చడంతో.. `వాల్తేరు మొనగాడు`నే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు, త్వరలోనే ఈ కొత్త టైటిల్‌ను ఓ అదిరిపోయే పోస్టర్‌తో ప్రకటించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
కాగా, బాబీ చిత్రం తర్వాత చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడు. డివివి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై సైతం ఇటీవలె అధికారిక ప్రకటన వచ్చింది.
This post was last modified on February 11, 2022 2:15 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…