Movie News

పుష్ప ప్లాన్ సక్సెస్

డిసెంబర్లో ఓ పెద్ద సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే అందుకు అనువైన సమయం అంటే క్రిస్మస్ వీకెండ్ అనే భావిస్తారు. పండుగ సందడిలో కొత్త సినిమాను రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వస్తాయి. ఏటా ఆ టైంలో బాలీవుడ్ భారీ చిత్రాలు ఆ టైంలో రిలీజవుతుంటాయి. ఈసారి కూడా ‘83’ మూవీ క్రిస్మస్ వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే తెలుగులో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప’ను మాత్రం క్రిస్మస్ వీకెండ్ కంటే వారం ముందే రిలీజ్ చేశారు.

నిజానికి ఈ నెల 17వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా కష్టమే అయింది. ఇంకో వారం టైం ఇచ్చి ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ సరిగ్గా జరిగి సినిమా ఔట్ పుట్ ఇంకా బాగుండేది కూడా. అయినా సరే.. నిర్మాతలు 17వ తేదీ రిలీజ్ విషయంలో అస్సలు తగ్గలేదు. ఐతే క్రిస్మస్ వీకెండ్ వదిలేసి, ముందే రావడాన్ని చూసి ముందు ఇదేం స్ట్రాటజీ అనుకున్నారు కానీ.. ‘పుష్ప’ టీం మాత్రం పక్కా ప్రణాళికతోనే ఇలా రిలీజ్ ప్లాన్ చేసింది.

‘పుష్ప’ మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా తొలి వీకెండ్లో టాక్‌తో సంబంధం లేకుండా సినిమాకు ఆటోమేటిగ్గా మంచి వసూళ్లు వస్తాయి. పైగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మీదే ఫుల్ ఫోకస్ ఉంటుంది. క్రిస్మస్‌కు రిలీజ్ చేస్తే వివిధ భాషల్లో పోటీగా చాలా సినిమాలున్నాయి కాబట్టి ‘పుష్ఫ’ మీద ప్రేక్షకుల దృష్టి నిలవకపోవచ్చు. తొలి వారాంతంలో మాగ్జిమం వసూళ్లు రాబట్టుకుంటే.. ఇంకో రెండో వారాంతంలో ఎలాగూ క్రిస్మస్ సీజన్ కలిసొస్తుంది. సినిమాలో సత్తా ఉంటే ఏడాదిలో లాస్ట్ వీకెండ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవచ్చు.

జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే వరకు మూడు వారాల పాటు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. క్రిస్మస్‌కు వస్తే ఫోకస్ తక్కువుంటుంది. పోటీని ఎదుర్కోవాలి. రెండు వారాలతో షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆలోచించే ‘పుష్ప’ను వ్యూహాత్మకంగా 17న రిలీజ్ చేశారు. ఈ ప్రణాళిక బాగానే పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తొలి వీకెండ్లో భారీగా వసూళ్లు రాబట్టుకుని పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశం అయిందీ చిత్రం. రెండో వీకెండ్లోనూ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. మూడో వారంలోనూ చెపపుకోదగ్గ షేరే వచ్చేలా ఉంది. ఆంధ్రా మినహా దాదాపుగా అన్ని చోట్లా ‘పుష్ప’ బయ్యర్లకు లాభాలే అందించేలా కనిపిస్తోంది.

This post was last modified on December 27, 2021 7:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

47 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

1 hour ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago