ప్రకాశం జిల్లాకు చెందిన యువ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన లీడరే. వివాదాలకు కేంద్ర బిందువు అనే పేరు సంపాయించుకున్నారని అంటారు స్థానికులు. గతంలో మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమం చి కాంగ్రెస్ నుంచి చీరాలలో విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ఆయన కాంగ్రెస్‌కు రాం రాం చెప్పినా.. 2014లో మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా నవోదయం అనే పార్టీ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీకి దిగి విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత టీడీపీలో చేరడం తెలిసిందే. అయితే, గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి.. వైసీపీ గూటికి చేరుకున్నారు. ఈ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేసినా.. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ ఉన్నప్పటికీ.. ఆమంచి మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
చీరాల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి విజయం సాధించారు. అయితే, ఆమంచి వర్గానికి కరణం వర్గానికి చీరాల నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనూ అనూహ్యంగా కరణం తన కుమారుడు వెంకటేష్‌ను వైసీపీలోకి పంపించారు. దీంతో ఆమంచి వర్గానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అసలు నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావాలని, తాను సూచించిన వారే అధికారులుగా ఉండాలని కోరుకునే ఆమంచి నిన్న మొన్నటి వరకు తన పట్టును సాధించారు. టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబును ఆయన మచ్చిక చేసుకుని తనకు నచ్చిన వారిని అధికారులుగా వేసుకున్నారు. జగన్ సర్కారులోనూ వారే కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల కరణం వెంకటేష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, ఆమంచి వర్గం వారికి అడుగడుగునా చెక్ పెట్టాలని చూడడంతో వివాదం రేగింది.
మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో టికెట్ల విషయంలో ఈ రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే, అప్పటికి పంచాయితీని సర్ది చెప్పిన ఇదే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్.. ఇరు వర్గాలకు టికెట్లు పంచేలా చేశారు. ఇక, ఇక్కడితో కథ అయిపోలే దు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆమంచి వర్గంలో నిరాశ ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఆమంచి హవా తగ్గుముఖం పట్టింది. పైగా కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమంచిని ఇంకా నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదనే టాక్ బహిరంగంగానే వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంకటేష్.. చీరాల వైసీపీ ఇంచార్జ్ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
వెంకటేష్‌కు కనుక చీరాల వైసీపీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తే.. మెజారిటీ టీడీపీ శ్రేణులు వైసీపీకి జైకొట్టే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. దీనిని మంత్రి బాలినేని కూడా నర్మగర్భంగా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమంచికి ప్రాధాన్యం రాను రాను పార్టీలో తగ్గించారు. దీనిని గ్రహించిన ఆమంచి.. ఇప్పటి వరకు మౌనంగా ఉండి కూడా ఇప్పుడు కొంచెం దూకుడు పెంచారు. పార్టీలో తన పట్టును నిలుపుకొనేందుకు, ఇంచార్జ్ పదవిని కాపాడుకునేందుకు శ్రేణులతో రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
అంతేకాదు, ఈనెల 30నాటికి జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ దూకుడు వెనుక ఇంచార్జ్ పదవిని కాపాడుకోవడం ఒక్కటే కారణమనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. అయితే, పార్టీ సీనియర్లు మాత్రం వెంకటేష్‌కు లైన్ క్లియర్ అయిందని, లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రకటించడమే తరువాయని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on May 25, 2020 9:49 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…