ఒక కారు మంచిదా? చెడ్డదా? అన్న దానికి సాంకేతిక అంశాలు ఎంత ముఖ్యమో.. అలానే క్రాష్ టెస్టులో సదరు కారుకు వచ్చే పాయింట్లు కూడా అంతే ముఖ్యం. కారు దృఢత్వాన్ని తెలిపే ఏకైక పరీక్ష ఇది. చాలా కార్లు జనాదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ.. క్రాష్ టెస్టులో మాత్రం అడ్డంగా ఫెయిల్ అవుతుంటాయి. ఇంతకూ ఈ క్రాష్ టెస్టు లెక్క ఎందుకంటే.. కారు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు.. మరో వాహనం ఢీ కొట్టినా.. లేదంటే ప్రమాదవశాత్తు మనమే ఢీ కొట్టినా.. కారుకు ఎంత బలంగా ఉంటుందో చెప్పే పరీక్షగా దీన్ని చెప్పాలి.
మన దేశంలోని చాలా కార్లు ఎంత మంచివని చెప్పినా.. చివరకు ఈ క్రాష్ టెస్టులో మాత్రం ఫెయిల్ అవుతుంటాయి. లేదంటే తక్కువగా మార్కులు వస్తుంటాయి. ఇటీవల కాలంలో వినియోగదారుల్లో పెరిగిన అవగాహన నేపథ్యంలో కార్ల కంపెనీలు సైతం ఈ క్రాష్ టెస్టుకు తమ కార్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల టాటా మోటార్స్ నుంచి విడుదలైన కర్వ్.. కర్వ్ ఈవీ కార్లు క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.
భారత్ న్యూకార్ అసెస్ మెంట్ ప్రోగరాం కింద ఈ రెండు కార్లు అత్యధిక రేటింగ్ పాయింట్లను అందుకున్నాయి. అడల్ట్ సేఫ్టీ విషయంలో 32 పాయింట్లకు 29.5 పాయింట్లు.. చైల్డ్ ప్రొటెక్ష్న్ విషయంలో 49కి 43.66పాయింట్లను కర్వ్ సాధించింది. ఇక కర్వ్ ఈవీ విషయానికి వస్తే 32 పాయింట్లకు 30.81 పాయింట్లు.. చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో 49 పాయింట్లకు 44.83 పాయింట్లను సొంతం చేసుకుంది. ఈ కారును సెప్టెంబరులో పరీక్షించారు. ఆగస్టులో లాంఛ్ అయిన ఈ కారుకు వచ్చిన రేటింగ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
టాటా కర్వ్ లో 6 ఎయిర్ బ్యాగులు.. 360 డిగ్రీల కెమెరా.. లెవల్ 2 అడాస్.. ఆల్ డిస్క్ బ్రేక్స్.. ఎలక్ట్రానిక్ పార్కింగ్ విత్ ఆటో హోల్డ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా కర్వ్ ఈవీలో ఆరు ఎయిర్ బ్యాగులు.. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటోహోల్డ్ ఫంక్షన్ తో తీసుకొచ్చింది. డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్.. బ్లైండ్ స్పాట్ మానిటర్.. లెవల్ 2 ఆడాస్ ఫీచర్లు ఉన్నాయి. ఇంతకూ ఈ కార్ల ధరల విషయానికి వస్తే.. కర్వ్ పెట్రోల్ వెర్షన్ రూ.9.99 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ రూ.11.49 లక్షలతో ప్రారంభమవుతుంటే.. కర్వ్ ఈవీ మోడల్ మాత్రం రూ.17.50 లక్షల నుంచి మోడళ్లు షురూ అవుతున్నాయి.
This post was last modified on October 16, 2024 10:57 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…