ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు బల్ల కింద చేతులు చాపడం సహజంగా మారిపోయింది. ఓ సర్వే అంచనా ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారిలో 65 శాతం మంది పైడబ్బులకోసం
ఆశపడే ఉద్యోగాల వేట సాగిస్తున్నారని తేలింది. ఇది ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజం. ఇక, ఇంట్లోఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఉంటే.. వెంటనే ఆ కుటుంబం అంతా.. ఎంత సంపాయించావ్!
అంటూ ప్రశ్నించడం కూడా మామూలైపోయింది.
భర్త సంపాయించే పైడబ్బుల
పై భార్య ఆశలు పెట్టుకోవడం సహజం. ఇక, భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగస్తు లైతే.. కొందరు నిజాయితీగానే పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం తప్పుదోవలో ఆదాయాలు వెతుక్కుంటున్నారు. అయితే.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు బట్టబయలు చేసిన సందర్భాలు లేవు. అంటే.. మా ఆయన లంచగొండి అని కానీ, నా భార్య లంచాలకు అలవాటు పడిందని కానీ.. చెప్పిన దంపతులు ఎవరూ కనిపించలేదు.
కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగు చూసిన సంఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తున్నా.. భర్త నిజాయితీకి అచ్చరువొందుతున్నారు. మణికొండ మునిసిపాలిటీలో డీఈఈగా పనిచేస్తున్న దివ్యజ్యోతి అనే అధికారి లంచావతారాన్ని ఆమె భర్తే స్వయంగా మీడియాకు చెప్పేశారు. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత.. కొన్నాళ్లు బాగానే పనిచేసినా.. తర్వాత లంచాల బాట పట్టిందని కట్టుకున్న భర్తే.. ఆధారాలతో సహా ఓ మీడియా సంస్థకు ఉప్పందించారు. అంతేకాదు.. ఆమె సొంత కప్ బోర్డులు, పిల్లో కవర్లు, పర్సులు, ఇలా ఎక్కడ చూసినా కనిపిస్తున్న నోట్ల కట్లను ఆయన వీడియో తీసి మరీ విడుదల చేశారు.
నా భార్యకు అనేక సార్లు చెప్పాను. లంచాలు తీసుకోవద్దు. నిజాయితీగా పనిచేయి. జీతం చాలు. అని చెప్పా. అయినా.. నామాట వినిపించుకోలేదు. ప్రతిరోజూ ఇంటి వస్తూనే కట్టలు తెస్తోంది. దీనిని చూసి నేను జీర్ణించుకోలేక పోయాను. అందుకే.. ఇప్పుడు వీడియోలు తీసి మీడియాకు అందిస్తున్నా. కనీసం ఇప్పటికైనా నా భార్య మారాలని కోరుకుంటున్నా
అని సదరు భర్త తన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. ఈ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో ఏసీబీ అధికారులు అలెర్ట్ అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా కట్టుకున్న భార్య అవినీతిపై ఇలా భర్తే కుండబద్దలు కొట్టడం మాత్రం దేశచరిత్రలో ఇదే తొలిసారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on October 15, 2024 4:47 pm
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…