Trends

రతన్ టాటాలో ఎవరికీ తెలీని కోనాన్ని చెప్పిన ప్రముఖుడు

భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాదు విలువలతో కూడిన వ్యక్తిత్వం.. వ్యాపారాన్ని పద్దతిగా నిర్వహించే రతన్ టాటా ఇప్పుడు గతమయ్యారు. తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడంతా ఆయనకు సంబంధించిన గురుతుల్ని తలుచుకుంటూ.. ఆయన వ్యక్తిత్వాన్ని అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ఐబీఎస్ సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్. రతన్ టాటాతో తనకున్న మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా రతన్ టాటా గురించి.. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి ఎవరికి తెలీని ఆసక్తికర సంఘటల్ని షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మానవత్వంతో పాటు హాస్య చతురతతో ఎవరైనా ఆయనతో ఇట్టే కనెక్ట్ అయిపోతారని చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరిచే టాలెంట్ ఆయన సొంతంగా అభివర్ణించారు.

ఆయనతో కలిసి కొంత కాలం పని చేసిన కారణంగా తనకు ఆయన గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు తెలుసంటూ ఆసక్తికర అంశాల్ని చెబుతూ.. “అమెరికా పర్యటనలో ఆయనతో కొంత టైం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకెప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. ఓ రోజు న్యూయార్క్ లోని టాటా సొంత హోటల్లో మేం టిఫిన్ చేశాం. ఆ సందర్భంగా రతన్ టాటా తాను ఆ హోటల్ కు యజమాని అన్న దర్పాన్ని అస్సలు ప్రదర్శించలేదు. ఆ మాటకు వస్తే తాను ఎవరన్న విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పలేదు. ఆయన నిరాడంబరతకు ఇదో నిదర్శనం” అని మాథ్యూస్ పేర్కొన్నారు.

అదే రోజు తర్వాత తాను..తన కుటుంబం మరో రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంగా అక్కడ కూడా రతన్ టాటా కనిపించారన్న ఆయన.. “రతన్ టాటా తన బిల్లును తానే తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఆయన ఎంత సింఫుల్ గా ఉంటారో ఇది తెలియజేసింది. ఆయనలో హాస్యచతురత ఎక్కువ. తన ట్రేడ్ మార్క్ హాస్యాన్ని ఆయన ప్రదర్శిస్తుంటారు. హోటల్ లో మరోసారి కలిసిన సందర్భంగా.. నేను నిన్ను వెంటాడుతున్నానా? నువ్వు నన్ను వెంటాడుతున్నావా? అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతరులతో ఇట్టే కనెక్ట్ అయ్యే తత్వం ఆయన సొంతం” అని మాథ్యూస్ తన గురుతుల్ని షేర్ చేసుకున్నారు.

This post was last modified on October 12, 2024 11:34 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పివిఆర్ పుష్ప 2 మధ్య ఏం జరిగింది?

నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…

13 minutes ago

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

4 hours ago

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

10 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

11 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

12 hours ago