దేశ పారిశ్రామిక దిగ్గజం.. రతన్ టాటా ఇకలేరు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ముంబైలోని ప్రముఖ ఆసుపత్రి బ్రీచ్ క్యాండీ లో ఆయన తుదిశ్వాస విడిచారు. జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన ఆయన తన పూర్తి సమయాన్ని టాటా వ్యాపార విస్తరణకు, అదేవిధంగా సమాజ సేవకు వినియోగించారు. 86 ఏళ్ల వయసులో టాటా కన్నుమూశారు. దేశానికి వ్యాపార పాఠాలు నేర్పిన టాటా
కేవలం వ్యాపార లాభాలే చూసుకోలేదు. వ్యాపారంలోనూ మానవత్వాన్ని పరిమళించేలా చేసింది.
టాటా పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన జమ్ షెడ్ టాటా.. తర్వాత తరంలో ఆయన కుమారుడు జేఆర్ డీ టాటా వ్యాపారంలోకి వచ్చారు. వీరిద్దరి తర్వాత.. జమ్‌షెడ్ టాటా మునిమనవడైన రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు టాటా అంటే కేవలం కొన్నిరంగాలకే పరిమితమైంది. భారీ వాహనాల తయారీ, యుద్ధ విమానాలు.. ఇతరత్రా వరకు మాత్రమే పరిమితమైన టాటాను.. రతన్ టాటా భూమార్గం పట్టించారు. ప్రతి ఇంటికీ పరిచయం చేశారు. టాటా సాల్ట్ నుంచి నిత్యం తాగే టీ(టెట్లీ) వరకు అనేక రూపాల్లో సామాన్య ప్రజలకు చేరువయ్యారు.
అంతేకాదు.. టాటా ఆభరణాలు(తనిష్క్ పేరుతో) వ్యాపారం ప్రారంభించారు. దీంతో పాటు టైటాన్ పేరుతో వాచీలకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇలా.. రతన్ టాటా తనదైన శైలిలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1990లో టాటా గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా బాద్యతలు చేపట్టిన రతన్ టాటా.. 2012 వరకు అంటే.. 22 ఏళ్ల పాటు ఆ బాధ్యతల్లో ఉన్నారు. అనుక్షణం పనే అనే సూత్రాన్నినమ్మిన ఆయన.. ప్రతి కదలికలోనూ.. ఫలితాన్ని కోరుకున్నారు. అందుకే.. ఎన్నో సంస్థలు.. విదేశీ పోటీ ఉన్నా.. నేటికీ టాటా
ఒక ప్రత్యేక బ్రాండు.. గుర్తింపుగా మిగిలిపోయింది.
జననం-మరణం..
This post was last modified on October 10, 2024 11:55 am
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…