రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీసి మంచి ఫలితాన్నే అందుకున్నాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. కానీ దీని తర్వాత ఇదే తరహాలో ఆయన తీసిన శాకుంతలం మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీని మీద పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోయింది.
ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. దీంతో ఆయన కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చింది. అలా అని సినిమాలేమీ ఆపేయలేదు గుణ. ఈసారి ట్రెండుకు అనుగుణంగా సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఆ చిత్రమే.. యుఫోరియా.
గుణశేఖర్ లాంటి దర్శకుడు ఇలాంటి టైటిల్ పెట్టడమేంటి అని అంతా అనుకున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్ చూస్తే సరైన టైటిలే అనిపిస్తోంది. ఈ కాలానికి తగ్గట్లుగా డ్రగ్స్ వినియోగం, మహిళలపై లైంగిక దాడుల నేపథ్యంలో నడిచే సినిమా ఇది. గ్లింప్స్‌లో కూడా అన్నీ దీనికి సంబంధించిన విజువల్సే చూపించాడు గుణశేఖర్.
‘యుఫోరియా’ టీజర్ గ్లింప్స్ చూస్తే ట్రెండీ కాన్సెప్ట్‌తోనే తీసినట్లు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాల గురించి.. మహిళలపై అత్యాచారాల గురించి ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. అనేక ఘోరమైన ఘటనల గురించి వార్తలు నిత్యకృత్యమైపోయాయి.
డ్రగ్స్ తీసుకుని అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోయాయి. గుణశేఖర్ ఈ నేపథ్యాన్నే ‘యుఫోరియా’ కోసం ఎంచుకున్నట్లున్నాడు. ఐతే కాన్సెప్ట్ ట్రెండీగా ఉన్నప్పటికీ టేకింగ్ రొటీన్‌గానే అనిపిస్తోంది. అంతే కాక అత్యాచార ఘటనలు, డ్రగ్స్ వినియోగం మీద కొన్ని సీన్లు చూసినా ఏదోలా అనిపిస్తుంది. ఒక రకమైన అలజడి రేగుతుంది.
కానీ ‘యుఫోరియా’ గ్లింప్స్ చూస్తే సినిమా మొత్తం ఈ అంశాల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. గ్లింప్స్ చూస్తే సినిమా అంతా చెడును చూపించి.. చివర్లో ఒక సందేశం ఇచ్చే సినిమాలా కనిపిస్తోంది. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో కొంచెం కష్టమైన కాన్సెప్ట్ ఎంచుకున్న గుణశేఖర్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి మరి.
This post was last modified on October 8, 2024 10:35 am
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…