ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ అధిపతి, సద్గురుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జగ్గీ వాసుదేవ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యవహార శైలిని మద్రాస్ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. మీ అమ్మాయికి పెళ్లి చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆమె తన జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు. మరి ఇతరుల జీవితాల్లోనూ ఇలాంటి ఆశలే ఉంటాయి కదా. వారికి మాత్రం సంసారం, పిల్లలు, భర్త అవసరం ఉండదా? కానీ, మీరు మాత్రం ఇతర అమ్మాయిలను సన్యాసులుగా మారుస్తున్నారు. ఇదేం పద్ధతి అని కడిగిపారేసింది.
తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో ఏర్పాటు చేసుకున్న ఈశా ఫౌండేషన్ ద్వారా.. విదేశీ విరాళాలు సేకరించడంతో పాటు.. అక్కడే పలు విద్యాసంస్థలను, వైద్య శాలలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవేవీ ఉచితం కాదు. ఇదేసమయం లో జగ్గీవాసుదేవ్ ఏటా మహాశివరాత్రిని ఘనంగా చేపడతారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులను రప్పిస్తారు. ఇది కూడా ఉచితం కాదు. రూ. లక్ష ఎంట్రీ ఫీజుగా ఉంటుంది. దీనిని మూడు మాసాల ముందే బుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వారిని ఆయన భక్తి మార్గంలో ముంచేస్తారు. ఇది మంచిదే. కానీ, ఆయన యువతులను వివాహం చేసుకోకుండా.. దేవుడికి అంకితం కావాలంటూ.. ప్రోత్సహిస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇదే వివాదం అయింది.
ఏం జరిగింది?
తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. కామరాజ్‌కు ఇద్దరు కుమార్తెలు. వీరు జగ్గీవాసు దేవ్ భక్తురాళ్లుగా మారిపోయారు. దీంతో తమ ఇంటిని కూడా వదిలేసి.. ఈశా ఫౌండేషన్‌లోనే ఉంటున్నారు. అయితే.. వీరిద్దరూ కూడా యుక్తవయసుకు రావడంతో కామరాజ్ తన కుమార్తెలకు వివాహం చేయాలని తలపోశారు. కానీ, ఈశా ఫౌండేషన్‌లో జగ్గీ వాసు దేవ్.. చేసిన బ్రెయిన్ వాష్‌తో ఆ ఇద్దరు యువతులు కూడా తాము పెళ్లి చేసుకునేది లేదని.. ఈశా ఫౌండేషన్‌కే తమ జీవితాలను అంకితం చేసి .. సన్యాసులుగా ఉండిపోతామని తెలిపారు.
దీంతో షాకైన కామరాజ్. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు.. సుబ్రమణియ న్, శివజ్ఞానం.. జగ్గీ వాస్‌దేవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుమార్తెకు వివాహం చేసి..సంసారం చేసుకునేలా ప్రోత్సహించిన మీరు.. ఇతర యువతులను ఇలా సన్యాసం దిశగా ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. ఇది సరైన విధానం కాదని ఏవగించుకున్నారు. ఇతర మహిళల సంసార జీవితాలను త్యజించమని ఎలా ప్రోత్సహిస్తారని నిప్పులు చెరిగారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
This post was last modified on October 2, 2024 12:12 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…