దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా దూసుకెళుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని మహానగరాల్లో రియల్ బూమ్ మామూలుగా లేదు. ఓవైపు ఐటీ రంగ పరిస్థితి సరిగా లేదని.. ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు డల్ గా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. అద్దె ఇంటి కోసం తమకు పెడుతున్న కండీషన్లపై పలువురు హాహాకారాలు పెడుతున్నారు.
దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే ముంబయి.. బెంగళూరు.. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భూములు.. అపార్టుమెంట్లు.. అద్దెలు భారీగా ఉన్నాయి. ఈ నగరాల్లో అద్దెలు అంతకంతకూ ఎక్కువ అయిపోతున్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. అపార్ట్ మెంట్స్ అద్దెలు మాత్రమే కాదు.. వాటికి ఫిక్స్ చేసిన అడ్వాన్స్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
జైపూర్ కు చెందిన ఉల్కర్ష్ గుప్తాతన ట్విటర్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసిన నెటిజన్.. “ఇలాంటివి ముంబయిలోనే సాధ్యమవుతాయి. టూ బీహెచ్ కే అద్దె నెలకు రూ.1.35 లక్షలు.. దీనికి రూ.4లక్షలు డిపాజిట్ చేయాలి. ఇంతా చేసిన తరవాత వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఉండటాన్ని చూడొచ్చు” అని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన పలువురు.. భిన్నాభిప్రాయాన్ని చెబుతున్నారు. కొందరేమో.. బ్రిలియంట్ ఐడియా అని ఒకరు స్పందిస్తే.. మరొకరు ఇది బాత్రూమేనా?’ అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అద్దె చాలా ఎక్కువని పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ వైరల్ పోస్టు ముంబయిలో ఇళ్ల అద్దెలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవ్చని మరొకరు రియాక్టు అయ్యారు.
This post was last modified on September 30, 2024 10:37 am
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…