తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కేజీ ఎంత?

పెను దుమారంగా మారిన తిరుమల లడ్డూ నాణ్యత అంశంపై బోలెడన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికి మూలం లడ్డూ నాణ్యత మీద ఉన్న అనుమానంతో..దానికి వినియోగించిన నెయ్యిని పరీక్షలకు పంపగా.. అందులో స్వచ్ఛమైన ఆవునెయ్యికి బదులుగా.. పందికొవ్వు.. గొడ్డు కొవ్వు ఉందన్న అనుమానాలు సంచంనలంగా మారాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వం తప్పు చేసిందని.. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిని కేజీ రూ.320కు కొన్నట్లుగా ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన ఆవు నెయ్యి కేజీ రూ.వెయ్యికి పైనే ఉందని.. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచారన్నారు.

నిజానికి తిరుమలకు ఆవునెయ్యిని కర్ణాటక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని డెయిరీ గతంలోనెయ్యి సరఫరా చేసేది. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మార్చేశారు. కేజీ రూ.320చొప్పున కేజీ ఆవు నెయ్యిని సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన వారికి కాంటాక్టులు కట్టబెట్టేశారని చెబుతున్నారు. లాభాల కోసమే ఈ తప్పుడు పనులు చేశారని మండిపడుతున్నారు.

అంతేకాదు.. తిరుమలకు లాభాలతో సంబంధం లేకున్నా.. నెయ్యిని సరఫరా చేస్తున్నా.. తమ ఆవునెయ్యిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకోవటం లేదన్న అంశంపై కర్ణాటక అసెంబ్లీలోనూ చర్చ జరిగిన విషయాన్ని ఆనం పేర్కొన్నారు. కర్ణాక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ లంచాలు ఇవ్వరు కాబట్టే.. ఆ నెయ్యిని వాడకుండా నాణ్యత లేని నెయ్యిని కాంటాక్టు రూపంలో ఇచ్చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.