హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ మాత్రం తగ్గని రీతిలో దూసుకెళుతోంది. కొన్ని విషయాల్లో హైదరాబాద్ కు సాటి రానట్లుగా పరిస్థితులు ఉన్నాయి. తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన రిపోర్టులో హైదరాబాద్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా పేర్కొంది.
అతి పెద్ద ఆఫీస్ స్థలాలకు హైదరాబాద్ లో గిరాకీ పెరిగిపోతోందన్న సదరు నివేదిక.. చిన్న స్థలాల కంటే కూడా పెద్ద ఆఫీసు స్థలాలకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఒక లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న వాటిని పెద్ద ఆఫీసు స్థలాలుగా లెక్కలోకి తీసుకుంటున్నారు. దేశంలోని వివిధ మహానగరాలతో పోల్చి చూసినప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఎంత బాగుందన్న విషయాన్ని ఈ రిపోర్టు చెప్పేసింది.
ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో హైదరాబాద్ లో నమోదైన ఆఫీస్ స్పేస్ కు సంబంధించిన లీజు లావాదేవీల్లోపెద్ద ఆఫీసు స్థలాల వాటానే అధికంగా ఉంది. ఇది 61 శాతంగా ఉన్నట్లుగా పేర్కొంది. గత ఏడాది మొదటిఆర్నెల్లతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో పెద్ద ఆఫీసుస్థలాలకు 109 శాతం అధిక గిరాకీ కనిపించినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో హైదరాబాద్ లో 50 లక్షల చదరపుఅడుగుల ఆఫీసు స్థలం లీజు లావాదేవీలు నమోదయ్యాయి. దీనికి కారణం గ్లోబల్ కేపబిలిటి సెంటర్ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు.
లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉన్న ఆఫీస్ స్పేస్ కు ఉన్న డిమాండ్ కు తగ్గట్లే.. మధ్యస్థాయి ఆఫీసు స్థలాలు (50వేల చదరపు అడుగులు – లక్ష చదరపు అడుగుల మధ్య ఉండే ఆఫీస్ స్పేస్)విభాగంలోనే డిమాండ్ అధికంగానే ఉన్నట్లు వెల్లడించింది. 50వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీలు 13 శాతంగా ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాలు పెరగటం.. మౌలిక సదుపాయాలు.. మానవ వనరుల లభ్యత ఎక్కువగా ఉండటంతో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. మొత్తానికి సమీప భవిష్యత్ మొత్తం హైదరాబాదే అన్నమాట.
This post was last modified on September 18, 2024 10:44 pm
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…