Trends

రూ.1.87 కోట్లు.. హైదరాబాద్ లో లడ్డూ వేలం కొత్త రికార్డు

వినాయకచవితి నిమజ్జనం వేళలో నిర్వహించే లడ్డూ వేలం ఎంతటి ఆసక్తిని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది హైదరాబాద్ శివారులోని ఖరీదైన విలాల్ల్లో జరిగిన లడ్డూ వేలం కోటి దాటేసి.. అందరూ వారివైపు చూడగా.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. తిరుగులేని రీతిలో ఈసారీ తమదే అత్యధిక లడ్డూ వేలంగా తేల్చేశారు. తాజాగా జరిగిన లడ్డూ వేలంలో లడ్డూను రూ.1.87 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపంలో గణనాథుని చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదాన్ని చివరి రోజున వేలం వేయటం తెలిసిందే. దాన్ని ఎవరైతే అత్యధిక ధరకు పాడతారో వారికి ఇస్తారు.

గత ఏడాది రిచ్ మండ్ విల్లాల వారు నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకగా.. ఈసారి దాన్ని మించి ఏకంగా రూ.1.87 కోట్లుగా పలికింది. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. మిగిలిన లడ్డూ వేలంకు రిచ్ మండ్ విల్లాస్ వేలంకు ఒక తేడా ఉంది. మిగిలిన చోట్ల ఒకరు.. లేదంటే కొందరు కలిసిన గ్రూప్ కలిసి లడ్డూ వేలంలో పాల్గొంటారు. కానీ.. రిచ్ మండ్ విల్లాస్ వైఖరి వేరు. వీరికి చెందిన ఆర్వీ దివ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా వేలంలో తమ ప్రాజెక్టులో ఉన్న విల్లాల వారంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. వారంతా కలిసి ఇచ్చిన మొత్తాల్ని ఏక మొత్తంగా చేస్తారు. ఆ మొత్తాన్ని లడ్డూ వేలం మొత్తంగా డిసైడ్ చేస్తారు.

అంటే.. మీడియాలో వచ్చిన విధంగా రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన లడ్డూ వేలం పాటలో పలికిన రూ.1.87 కోట్ల మొత్తాన్ని ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా పాడలేదు. వీరికి చెందిన ట్రస్టు తరఫున.. అందరూ కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. అయితే.. ఇక్కడ ఎవరికి వారు పోటాపోటీగా క్రౌడ్ ఫండింగ్ కు విరాళాలు ఇస్తారు. దీంతో.. భారీ మొత్తం సిద్ధమవుతుంది. వీరు కలెక్టు చేసిన భారీ మొత్తాన్ని 42 వేర్వేరు ఎన్జీవోల ద్వారా పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం లక్షలాదిగా జరిగినా.. రిచ్ మండ్ విల్లాస్ వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుందని చెప్పక తప్పదు.

This post was last modified on September 17, 2024 9:49 am

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

6 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

7 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

7 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

8 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

10 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

11 hours ago