మంచో చెడో.. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక మాట అనేశారు. జగన్ చాలా నేర్చుకోవాలి అని! ఔను. ఇది వాస్తవం కూడా.
ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేయాలని చూసిన జగన్.. డబ్బులు ఇస్తు న్నాం.. మనకే ఓటేస్తారని భావించిన జగన్.. తాజా ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు.
జనం డబ్బుకు కాదు.. లొంగేది.. అభిమానానికని నిరూపించారు. కానీ, జగన్ నేర్చుకోలేక పోయారు. విజయవాడకు వరదలు వచ్చాయి. సర్వస్వం కోల్పోయారు. ఈ విషయం సర్కారే చెప్పింది.
అయినా.. జనం ఆనందంగానే భరిస్తున్నారు. కారణం.. వారి కష్టాన్ని తన కష్టంగా భావించిన చంద్రబాబును చూసు కుని. వరదలు వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి మందిరంలో కూర్చుని అధికారులను పంపించలేదు.
తానే స్వ యంగా మోకాల్లోతు నీటిలో దిగారు. ప్రజలకు ఏమీ తీసుకువెళ్లలేదు.. కొండంత మనోధైర్యాన్ని తప్ప. తొలి రెండు రోజులు పాపం.. అలానే జరిగిపోయింది.
ఆ సమయంలో అసలు ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. అయినా.. జనం కుంగిపోకుండా జాగ్రత్త పడ్డారు. తన మాటలతోనే వారికి ధైర్యం చెప్పారు.
చేయాల్సిన పనులు తర్వాత నుంచి వేగం పెంచారు. ఆహారం, నీరు.. అందించారు. ఎక్కడెక్కడ నుంచో మనుషు లను రప్పించారు. నేనున్నానంటూ.. ముందుకు సాగారు.
ఇతమిత్థంగా చెప్పాలంటే.. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి అందింది.. రేషన్, ఆహారం, తాగునీరు మాత్రమే. కానీ, వారు రెచ్చిపోలేదు. తమకు ఏమీ చేయలేదన్న బాధ కూడా వారిలో పెద్దగా కనిపించడం లేదు. రీజన్.. ఏదైనా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న భావనను వారిలో బలంగా నింపగలిగిన భరోసాను చంద్రబాబు ఇప్పటికే ఇచ్చేశారు.
ఇక, పవన్ కల్యాణ్.. క్షేత్రస్థాయికి వెళ్లలేదు. కానీ, ఆయన చేయాల్సింది ఆయన చేశారు. పంచాయతీలకు లక్ష చొప్పున 400 పంచాయతీలకు ఇచ్చారు. కోటి రూపాయలను వరద ప్రభావిత ప్రాంతాల కు సాయంగా అందించారు. ఇదీ.. ఆయన రాకపోయినా.. జరిగిపోయిన పని.
దీనినే జగన్ ఇప్పుడు నేర్చుకోవాలన్నది మంత్రి మనోహర్ చెబుతున్న మాట. నాలుగు రాళ్లు వేయడం తేలిక.. రాళ్లు తీయడమే కష్టం. చంద్రబాబు, పవన్‌లు చేసింది.. రాళ్లు వేయడం కాదు.. కష్టాల రాళ్లను తొలగించడం. దీనినుంచే జగన్ చాలా నేర్చుకోవాలి!! నేర్చుకుంటారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on September 14, 2024 3:13 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…