రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని.. వరద కష్టాన్ని.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు విన్నవించా రు. ప్రస్తుతం రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన విపత్తు బృందాలు.. రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. రేపు కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వారికి వివరించారు.
ఇదేసమయంలో నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి.. వారికి స్వయంగా చంద్రబాబు వివరిం చారు. రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఊళ్లకు ఊళ్లే మునిగిపో యాయని.. రోజుల తరబడి.. ప్రజలు నీటిలో నానిపోయారని.. ఇళ్లు.. దుస్తులు.. వస్తువుల కూడా కోల్పోయారని.. వారి కష్టం.. నష్టం అంతా ఇంతా కాదని వివరించారు. ఇప్పటికే తాము ప్రాథమికంగా ఒక అంచనా వేసి.. రూ.6880 కోట్ల మేరకు నష్టం వచ్చినట్టు గుర్తించామన్నారు.
దీనికి సంబందించిన నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇక, పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కష్టాన్ని, నష్టాన్ని గమనించి.. జాతీయ విపత్తు గా ప్రకటించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. జరిగిన నష్టాన్ని గమనించాలని ఆయన విన్నవించారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నామని.. కట్టుబట్టలతో మిగిలిన వారి కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలు.. వీడియోలను కూడా వారికి చూపించారు.
ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. తాము కూడా క్షేత్రస్థాయిలో పర్యటించామని, పరిస్థితిని గమనించామన్నారు. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని వారే చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి జోక్యం చేసుకుని రైతులకు వచ్చిన కష్టం కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉందన్నారు. వేలాది హెక్టార్లు నీట మునిగాయని అన్నారు. వారికి కూడా న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు.
This post was last modified on September 13, 2024 10:22 am
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…