ఒక సినిమా రిలీజ్ అవ్వడం మీద కన్నా మొదలుపెట్టడం గురించి విపరీతమైన ఉత్సుకత కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాటిలో ఇప్పుడు మొదటి వరసలో ఉన్నది మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ.
ఫ్యాన్స్ ఎదురు చూపులకు పరీక్ష పెడుతూ జక్కన్న టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అలాని పనులేవీ ఆగలేదు. వర్క్ షాప్స్, ఆడిషన్స్ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ దాదాపు లాక్ చేశారట. మహేష్ బాబు మీద రెండు ఫోటో షూట్స్ జరిగినా వాటి తాలూకు లీక్స్, వివరాలు ఏ రూపంలోనూ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక కొన్ని ఎక్స్ క్లూజివ్ లీక్స్ అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ మూవీ అడవి నేపథ్యంలో జరిగే సంగతి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో బయట పెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఇది 1800 సంవత్సర కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామాగా వినిపిస్తోంది.
200 పైగా కీలకమైన ఆర్టిస్టులు ఇందులో భాగం పంచుకోబోతున్నారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్లు, గిరిజన జాతికి సంబంధించి లుక్స్ అన్నీ సూక్ష్మ స్థాయిలో జాగ్రత్త తీసుకుని డిజైన్ చేయిస్తున్నారట. మహేష్ ఇప్పటికే పొడవాటి జుట్టుని పెంచడంతో గుబురు గెడ్డంతో తనను తాను మార్చుకోవడం చూశాం.
ఇదంతా ఫైనల్ కావడానికి కనీసం ఇంకో మూడు నెలలు సమయం పట్టేలా ఉంది. జనవరిలో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రొడక్షన్ కు రెండు సంవత్సరాలు, ఆపై నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషన్లకు మరో ఆరేడు నెలలు మొత్తం కలిపి ఓ మూడేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వదలుకోవాల్సి ఉంటుందని జక్కన్న ముందే చెప్పినట్టు వినికిడి.
దానికి మహేష్ అంగీకారం వచ్చాకే అడుగులు ముందుకు పడ్డాయట. సో మూవీ లవర్స్ నిరీక్షణ చాలా సుదీర్ఘంగా ఉండబోతోంది. దానికి ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు.
This post was last modified on September 13, 2024 10:24 am
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…