భారత స్టార్ క్రికెటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య.. సెర్బియాకు చెందిన మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లు అన్యోన్యంగా సాగిన ఈ జంటకు ఓ కొడుకు పుట్టడం.. కానీ తర్వాత విభేదాలు వచ్చి ఈ జంట విడిపోవడం తెలిసిందే.
ఈ ఏడాది ఆరంభంలో ఈ జంట విడిపోయింది. ఐతే అది జరిగిన కొన్ని నెలలకే నటాషా కొత్త బంధంలోకి వెళ్లిపోవడం విశేషం. తాజాగా తన కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆమె ముంబయి చక్కర్లు కొడుతూ మీడియా కంట పడింది.
హార్దిక్ నుంచి విడిపోయాక స్వస్థలమైన సెర్బియాకు వెళ్లిపోయిన నటాషా.. ఇటీవలే తిరిగి ముంబయికి వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వెంట వచ్చాడు. తమ ఇద్దరినీ మీడియా వాళ్లు ఫొటోలు తీస్తున్నా నటాషా పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి కారు ఎక్కి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.
ప్రస్తుతానికి హార్దిక్ అయితే ఒంటరిగానే ఉన్నాడు. విడాకుల అనంతరం కొడుకును తీసుకుని సెర్బియాకు వెళ్లిన నటాషా.. ఇటీవలే ఇక్కడికి తిరిగొచ్చాక కొడుకును తండ్రి వద్ద విడిచిపెట్టింది. తాజాగా వినాయక చవితి వేడుకల్లో హార్దిక్, కృణాల్ కుటుంబాలతో కలిసి ఆ పిల్లాడు సందడి చేశాడు.
నటాషాను కరోనా టైంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు హార్దిక్. ఓ షిప్‌లో వీరి పెళ్లి జరిగింది. కరోనా టైంలో కాబట్టి పెళ్లి ఘనంగా చేసుకోలేదని.. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రత్యేకంగా వేడుకలు చేసుకున్నారు హార్దిక్, నటాషా. ఇదంతా ఏడాది ముందే జరిగింది.
అప్పుడు అంత హుషారుగా ఉన్న జంట.. ఏడాది తిరిగే లోపు విడిపోయింది. భరణం కింద నటాషాకు హార్దిక్ భారీ మొత్తంలో డబ్బు, ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ఐతే కొడుకు మాత్రం ఇద్దరి దగ్గరా పెరిగేలా వీరి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
This post was last modified on September 12, 2024 6:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…