టాలీవుడ్డే కాదు దేశంలో అన్ని వుడ్డులు ఎదురు చూస్తున్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబినేషనని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అనౌన్స్ చేసి నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ప్రారంభోత్సవం జరగకపోవడంతో అభిమానులు సహజంగానే ఖంగారు పడతారు.
ఒకపక్క మహేష్ కొత్త లుక్ తో బయట అదరగొడుతూ ఉండగా ఇక అసలు మూవీలో ఎలా ఉంటాడోనని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. అయితే ఎన్నిరకాలుగా అప్డేట్స్ కోసం ఎదురు చూసినా ఆ క్షణం మాత్రం రావడం లేదు. కృష్ణ, మహేష్ పుట్టినరోజులు అయిపోయినా ఏ జాడ లేదు.
అడిగితే మాత్రం నిర్ధాక్షిణ్యంగా కొట్టేస్తా అంటున్నారు జక్కన్న. మత్తువదలరా 2 ప్రమోషన్స్ కోసం తనను కలిసిన శ్రీసింహ, కాల భైరవలు చిన్న వీడియో బైట్ తీసుకున్నాక చివర్లో ఎస్ఎస్ఆర్ఎంబి అప్డేట్ ఇవ్వొచ్చుగా అని అడిగితే కర్ర తీసుకుని కొట్టడానికి సిద్ధపడటం వైరలవుతోంది.
సరదాగా చేసిందే అయినా రాజమౌళి మనసులో మాత్రం నిజంగా ఆ ఉద్దేశమే ఉంది. మహేష్ ఫ్యాన్స్ నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఏ మాత్రం చలించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రెండు వర్క్ షాపులు, ఆడిషన్లు జరిగాయని సమాచారం ఉంది కానీ సరైన స్పష్టత లేదు.
ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం ఈ ఎస్ఎస్ఎంబి గ్లోబల్ మూవీని జనవరిలో లాంఛ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. అయితే రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ కలిసి నిర్ధారణగా ఓకే అనుకున్న తర్వాతే ప్రకటన ప్లస్ ప్రెస్ మీట్ రెండూ ఉంటాయి. సంక్రాంతి పండగ మంచి అకేషన్ కాబట్టి దాన్నే ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఇంకో నాలుగు నెలలు ఎదురు చూడక తప్పేలా లేదు. క్యాస్టింగ్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ త్వరలోనే కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కి ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా కనీసం మహేష్ అభిమానులకు కనీసం రెండేళ్ల నిరీక్షణ తప్పదు.
This post was last modified on September 11, 2024 4:41 pm
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…