మారుతున్న కాలానికి తగ్గట్లు కొత్త తరహా అభిరుచులు తెర మీదకు వస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలకు భిన్నంగా మన వద్ద వివాహ వ్యవస్థ బలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులు.. పిల్లల పెంపకంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. యువతులకు అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలు వారి ఆలోచనల్ని మార్చేలా చేస్తున్నాయి.
స్వేచ్ఛగా తమకు తోచినట్లుగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో మాదిరి పెళ్లి.. పిల్లలు లాంటి వాటికి భిన్నంగా.. సింగిల్ గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్న కొత్త ట్రెండ్ ఇప్పుడు మొదలైంది.యువతుల ఆలోచనల్లో మార్పు వస్తోందని.. పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపని వైనం పెరిగింది. ఈ విషయాల్ని మోర్గానిక్ స్టాన్లీ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా వచ్చిన మార్పులకు కారణం.. సామాజికంగా చోటు చేసుకున్న పరిణామాలుగా చెబుతున్నారు.
గతానికి భిన్నంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలమనే నమ్మకం వారిలో పెరగటంతో పాటు.. ఉపాధి.. ఉద్యోగ అవకాశాలు కూడా వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవటానికి కారణమవుతున్నాయి. ఆర్థిక స్వేచ్ఛతో వ్యక్తిగత నిర్ణయాల్ని సైతం తమకు తోచిన విధంగా ఉండేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రేమ.. పెళ్లి.. డేటింగ్ లాంటి అంశాల్లో సొంత నిర్ణయాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. పెళ్లిళ్లపై ఆసక్తి తగ్గుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందన్న వాదన పెరుగుతోంది. తాజా సర్వే ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో సింగిల్ గా ఉండే మహిళల సంఖ్య 45 శాతానికి పెరగనున్నట్లు అంచనా వేశారు.
నేటి యువతులు పెళ్లి చేసుకొని.. ఇంటి పట్టునే ఉండి పిల్లల్నికనడానికి ఆసక్తి చూపటం లేదని.. ఇంటి బాధ్యతల కన్నా నచ్చిన చదువులు చదవటం.. ఉద్యోగాలు చేయటం.. వీలైనంతవరకు పెళ్లి.. పిల్లల లాంటి విషయాలకు దూరంగా జీవితాన్ని గడపటానికే ఆసక్తి చూపుతున్న వైనాన్ని గుర్తించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు.. కెరీర్ కు సంబంధించిన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి అన్నది జీవితంలో రెండో ప్రాధాన్యతగా మారింది. కొందరి విషయంలో పెద్దగా అవసరం లేని విషయంగా కూడా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోని వారి సంగతి ఇలా ఉంటే.. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 30-40 ఏళ్ల వయసులో ఉన్న మహిళల్లో విడాకుల సంఖ్య పెరుగుతోందన్న విషయాన్ని తాజా సర్వే వెల్లడించింది. ఒంటరి మహిళల సంఖ్య పెరగటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఒకప్పుడు ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకొని తల్లి కావాలన్న ఆసక్తి యువతుల్లో ఉండేదని.. భర్త.. కుటుంబమే లోకంగా భావించేవారని.. ఇప్పుడు అలా కాదంటున్నారు. సింగిల్ లైఫ్ కోరుకునే మహిళల సంఖ్య 2030 నాటికి 45 శాతం పెరుగుతుందని తేల్చారు.
This post was last modified on September 10, 2024 10:31 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…