అత్యాధునిక సౌకర్యాలు మల్టీప్లెక్సుల్లో ఎన్ని ఉన్నా సింగల్ స్క్రీన్లలో సినిమా చూస్తే దక్కే అనుభూతే వేరు. క్రాస్ రోడ్స్ సుదర్శన్ లో చూస్తే దక్కే కిక్కు పంజాగుట్ట పివిఆర్ అనుభూతి ఇవ్వదనేది ఏ సినీ ప్రియుడైనా ఒప్పుకునే వాస్తవం. కానీ అలాంటి సువిశాలమైన హాళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. క్రమంగా ఉనికిని కోల్పోతూ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని కార్పొరేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క 2023 సంవత్సరంలోనే 650 పైగా సింగల్ స్క్రీన్లు మూతబడి షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణ మండపాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి.
గత దశాబ్దంన్నర కాలంలో ఈ లెక్క 5 వేలకు పైగానే ఉంది. ప్రస్తుతం ఇండియా వైడ్ ఉన్న 9 వేలకు పైగా ఉన్న తెరలలో సింగల్ స్క్రీన్లు అయిదు వేలలోపే ఉన్నాయి. అందులో 70 శాతం దాకా దక్షిణాది రాష్ట్రాల్లోనే మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడుదే అగ్ర స్థానం. కేరళ, కర్ణాటకలో చాలా తక్కువ. ఈ ఏడాది పూర్తిగా మల్టీప్లెక్సుల ఆధిపత్యం మొదలైపోయింది. టికెట్ రేట్ తో మొదలుపెట్టి పాప్ కార్న్ దాకా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిన వీటిలో రెగ్యులర్ గా సినిమాలు చూడటం మధ్య తరగతి జీవులకు అంత సులభం కాదు.
రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పెద్ద స్థలంలో ఒక థియేటర్ నడపడం కన్నా కాంప్లెక్స్ కట్టి అయిదో ఫ్లోర్ లో స్క్రీన్లు పెట్టి మిగిలిన నాలుగు అంతస్తులు దుకాణాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం కొన్ని పదుల రెట్లు అధికంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక సింగల్ స్క్రీన్ పైన వచ్చే ఆదాయం నెలకు పది లక్షలు అనుకుందాం. అదే షాపింగ్ కాంప్లెక్స్ అయితే కోటికి పైగానే ఎలాంటి రిస్క్ లేకుండా లెక్కబెట్టుకోవచ్చు. ఇలాంటి లెక్కల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అయినా సింగల్ స్క్రీన్లు నడిపిస్తున్న వాళ్లకు జేజేలు కొట్టాల్సిందే.
This post was last modified on September 7, 2024 10:17 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…