నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కం డెబ్యూ సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ని షేర్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తనకు బాలయ్యకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది.
దానికి తోడు ఇటీవలే జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ రాకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. దేశంలో లేకపోతే డిస్కషన్ ఉండేది కాదు కానీ వచ్చే వెసులుబాటు సులభంగా ఉండి కూడా దూరం ఉండటం మీద ఫ్యాన్స్ డిస్కస్ చేసుకున్నారు.
ఇప్పుడు తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తనవైపు నుంచి మొదటి అడుగు వేసినట్టయ్యింది. తాతయ్య ఆశీసులు ఉంటాయని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే ట్వీట్ లో బాలయ్య పేరు లేకపోవడం గురించి కొందరు చెవులు కోరుకుంటున్నా ఇప్పటికైతే దాన్ని మరీ లోతుగా చూడాల్సిన అవసరం లేదు.
ఈ నెల 27 విడుదల కాబోతున్న దేవర 1 ఓపెనింగ్స్ లో బాలకృష్ణ అభిమానుల పాత్ర పూర్తి స్థాయిలో ఉండాలని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే వసూళ్ల ఫిగర్లు మరింత భారీగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాబట్టి దాన్ని గుర్తించే అవకాశం లేకపోయింది.
ఏది ఏమైనా ఒక వేదికపై అందరూ కనిపిస్తే తప్ప వీటికి చెక్ పడటం కష్టం. త్వరలోనే గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్న మోక్షజ్ఞ సినిమా ప్రారంభోత్సవానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరైతే ఇంకెలాంటి డిబేట్లకు ఆస్కారం ఉండదు. ఇప్పటిదాకా ఏమేం మిస్సయ్యారనే రివైండ్లు ఆపేయొచ్చు.
ఇది చూడాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాలి. ఇంకో వారం రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్యాన్ ఇండియా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొనబోతున్నాడు. అప్పుడు ఎలాగూ ప్రెస్ మీట్లలో పైన చెప్పిన విషయాలకు సంబంధించిన బోలెడు ప్రశ్నలు ఎదురవుతాయి. చూడాలి ఏం బదులు చెబుతాడో.
This post was last modified on September 6, 2024 5:55 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…