వరద బాధితులకు సాయం చేయడంలో మంత్రులు పడుతున్న కష్టం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉం ది. రాజకీయంగా దూకుడు ఉండే అనేక మంది నాయకులు బాధితుల కష్టాలు చూసి కరిగిపోతున్నారు. విజయవాడ శివారు ప్రాంతం మునిగిపోయిన నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు.. సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులను కూడా రావాలని ఆయన పిలుపు నిచ్చారు. దీంతో ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగారు.
వీరిలో కొందరు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. బాధితుల కష్టాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిలు ఏకంగా బాధిత ప్రాంతాల్లో కలియదిరుగుతున్నారు. బుడమేరు గండి పూడ్చే వరకు తాను అక్కడే ఉంటానని నిమ్మల శపథం చేసి మరీ.. అక్కడే ఉన్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు.. తాగునీటిని సాధ్యమైనంత వరకు వేగంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, గొట్టిపాటి రవి అయితే..శివారు ప్రాంతాల్లో విద్యుత సరఫరాను పునరుద్ధరించే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారు. అధికారులను రాత్రి వేళల్లో కూడా అక్కడే ఉంచి.. తాను కూడా ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. మరో మంత్రి నారా లోకేష్.. సమన్వయం చేస్తూ.. ఎక్కడా లోపాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రులను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి బాధితుల గోడును స్వయంగా వారికి వినిపిస్తూ.. చొరవ తీసుకుంటున్నారు.
జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్.. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మరోవైపు.. కేంద్రానికి తగిన విధంగా నివేదికలు రూపొందించే పనిలో ఉన్నారు. హోం మంత్రి అనితకూడా రాజరాజేశ్వరి పేటలోనే తిష్ట వేశారు. ఇక్కడ మహిళలు ఎక్కువగా బాధల్లో ఉన్నారు. వారికి ఓదార్పు నిస్తూ.. వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటున్నారు. మంత్రి సవిత విజయవాడలో ఉండి.. ఆహార పంపిణీ.. నీటి పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇలా.. చంద్రబాబు టీం అద్భుత పనితీరు చూపిస్తోంది. అయితే.. లోపం ఏంటంటే.. బాధితులు ఎక్కువగా ఉండడం.. శివారు ప్రాంతంలో ఉండడంతో తగిన విధంగా సాయం అందడం లేదనేది వాస్తవం.
This post was last modified on September 6, 2024 5:11 pm
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…
తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2…
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…