వైసీపీ నాయకురాలు, జబర్దస్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా.. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఘటనతో సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటన సభ్యసమాజానికి మాయని మచ్చగా మారిపోయిందన్నారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే కెమెరాలు ఏమీ కనిపించలేదని ఎస్పీతో సర్టిపికేట్ ఇప్పించారని రోజా దుయ్యబట్టారు. ఈ రోజు నేరస్తులకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిం చారు. దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిం చేందుకు సరైన కార్యాచరణను ప్రకటించాలని సూచించారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ పోలీసు స్టేషన్లను నిర్వీర్యం చేశారని.. దిశ యాప్‌లు తీసేశారని అన్నారు.
దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ, గతంలో వైసీపీ హయాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమల దర్శనాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా దర్శనాలుచేసుకున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. తాజాగా తనతో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించలేదు. దర్శనం చేసుకుంటే తప్పులేదు కదా! అన్నారు.
This post was last modified on September 1, 2024 1:26 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…