ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. ఆమెకు ఫ్రీహ్యాండ్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. వైఎస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో ఆయనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. కాబట్టి.. ఇప్పుడు నాకు కూడా.. ఫ్రీహ్యాండ్ కావాలి. నేను తీసుకునే నిర్ణయాలకు క్షేత్రస్థాయి నాయకులు ఆమోదం తెలపాలి. అప్పుడే పార్టీ పుంజుకుంటుంది
అని షర్మిల తేల్చిచెబుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే షర్మిల తన డిమాండ్‌ను అధిష్టానం ముందు పెట్టారని కూడా సమాచారం. ఈ విషయంపై అధిష్టానం నుంచి ఇంకా పూర్తి నిర్ణయం వెలువడలేదు. అందుకే.. షర్మిల సైలెంట్ అయ్యారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇంతకు ముందు.. రోజూ ఏదో ఒక అంశంతో ఆమె ప్రజల మధ్య ఉన్నారు. వైసీపీని విమర్శిస్తూ.. ప్రభుత్వ సూపర్ సిక్స్‌ను ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిం చారు. కానీ.. గత నెల రోజులకు పైగా షర్మిల సైలెంట్‌గా ఉంటూ.. తన రాజకీయం తాను చేస్తున్నారు.
ఈ పరిణామాల వెనుక అధిష్టానం షర్మిల విషయంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదనే వినిపిస్తోంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపడం లేదని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇలా ఫ్రీహ్యాండ్ ఇస్తే.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు .. జంప్ అయ్యే అవకాశం లేదా.. ఏకండా రాజకీయాలకు కూడా దూరమయ్యే అవకాశం మెండుగా ఉందని భావిస్తున్నారు. అందుకే ఇవ్వడం లేదన్నది ఒక టాక్. మరో మాట ఏంటంటే.. అప్పట్లో రాజశేఖరరెడ్డికి 30 ఏళ్లకుపైగానే అనుభవం ఉన్నదరిమిలా.. ఆయన నెట్టుకువచ్చారనేది.
అంటే.. కాంగ్రెస్ పార్టీ అంటేనే.. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. సో.. ఆ పార్టీ లో ఎవరూ ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వరు. ఏ చిన్న సమస్య వచ్చినా.. నేరుగా అధిష్టానానికి చెబుతారు. వీటిని లోకల్‌గానే సర్దుబాటు చేయాలంటే.. వైఎస్‌కు ఉన్నంత అనుభవమైనా ఉండాలి. లేదా.. ఆయనకు ఉన్న రాజకీయ చతురతైనా ఉండాలి. కానీ, వైఎస్‌కు వారసురాలిగా చెబుతున్న షర్మిలలో ఈ రెండూ లేవు. నోటికి వచ్చింది. మాట్లాడేయడమే తప్ప.. ఆలోచన లేదు. పైగా.. సీనియర్లంటే.. ఆమెకు గిట్టరన్న వాదన కూడా ఉంది. ఈ పరిణామాలతోనే చాలా మంది నాయకులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.
ఇప్పుడు ఆమెకే కనుక ఫ్రీహ్యాండిస్తే.. పార్టీ పుంజుకోవడం మాట ఎలా ఉన్నా.. మరింత ఇబ్బంది పడుతుందన్నది అధిష్టానం ఆలోచనగా ఉందని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే.. ఆమె డిమాండ్ పై పునరాలోచనలో పడ్డారన్నది వినిపిస్తున్న వాదన. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ తన డిమాండ్‌ను పట్టించుకోకపోతే.. షర్మిలకు ప్లాన్-బి
రెడీగా ఉందన్నది సీనియర్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 9, 2024 10:40 am
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…