వైసీపీకి రాజీనామా చేయనున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. జగన్.. తనకు ఎన్నో పదవులు ఇచ్చారని.. అయినా.. ఆయనను తాను మోసం చేసి ఇప్పుడు పార్టీ మారుతున్నానన్న వైసీపీ నేతలకు తాను బదులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో జగన్ కోసం తాను ఎన్ని త్యాగాలుచేశానో.. వీరికి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోపిదేవి మాట్లాడుతూ.. తన రాజీనామాను సమర్థించుకున్నారు.
ఎన్నికల సమయంలో తాను టికెట్ అడిగితే.. కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే జగన్ ఇవ్వ నని కటువుగా చెప్పేశారని.. అప్పుడే తాను పార్టీకి రాజీనామా చేయాలని భావించానని మోపిదేవి వివరిం చారు. కానీ, జగన్ మారతారేమోనని తాను ఎదురు చూసినట్టు చెప్పారు. ఇక, మార్పు రాదని నిర్ణయించు కున్న తర్వాత.. తానే మారాలని భావించినట్టు తెలిపారు. తన కోసం.. జగన్ చేసిన త్యాగాలేమీ లేవన్నారు . తానే అనేక త్యాగాలు చేశానని.. ఇప్పుడు అవన్నీ చెబితే బాగోదని వ్యాఖ్యానించారు.
తాను రాజీనామాచేయడం సరైన చర్యేనని మోపిదేవి చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం బాగు పడుతుందన్న ఏకైక ఉద్దేశంతోనే తాను పార్టీ మారుతున్నట్టు తెలిపారు. రాజీనామా నిర్ణయాన్ని తన అనుచరులతో చర్చించిన తర్వాతే తీసుకున్నట్టు తెలిపారు. అయితే.. వైసీపీకి రాజీనామా చేయడం తనకు ఏమీ బాధకలిగించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం అన్ని విధాలా బాగవుతుంటే.. చంద్రబాబుకు మద్దతివ్వక ఎవరికి ఇవ్వాలని ఎదురు ప్రశ్నించారు.
ఏంటీ త్యాగాలు!
మోపిదేవి చెప్పినట్టు.. జగన్ కోసం ఆయన చేసిన త్యాగాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న మోపిదేవి.. అప్పట్లో వాన్‌పిక్ భూముల కుంభకోణంలో చిక్కుకున్నారు. వాన్‌పిక్ సంస్థకు తక్కువ ధరలకు భూములు లీజులు ఇచ్చారు. ప్రతిగా ఈ సంస్థ జగన్ సంస్థలకు పెట్టుబడులు సమకూర్చిందనేది సీబీఐ కేసు. ఈ కేసులోనే అప్పట్లో అనుమతులు మంజూరు చేశారన్న కారణంగా.. మోపిదేవిని అరెస్టు చేసి.. జైల్లో పెట్టారు. సుదీర్ఘకాలం జైలు జీవితం తర్వాత.. ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. బహుశ ఆయన ఉద్దేశంలో ఇదే త్యాగమై ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
This post was last modified on August 29, 2024 10:45 pm
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…
అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…