సినిమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒక దశలో ‘మీ టూ’ పేరుతో ఉద్యమం పతాక స్థాయిలో సాగింది. అందుకు ప్రధాన కారణం.. ఓ మళయాల స్టార్ హీరోయిన్ మీద ఒక హీరో కక్ష గట్టి తన అనుచరులతో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులు చేయించడం. అప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఒక రెండేళ్ల పాటు సినీ రంగాన్ని కుదిపేసింది.
ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న అనేకమంది బాగోతాలు ఈ క్రమంలో వెలుగులోకి వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ చట్టపరంగా శిక్ష పడి ఉండకపోవచ్చు కానీ.. వాళ్ల ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. అదే సమయంలో ఇదే అదనుగా ఫేక్ ఆరోపణలు చేసిన అమ్మాయిలు కూడా ఉన్న మాట వాస్తవం.
కాగా తమిళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక అక్కడ ప్రకంపనలు రేపుతోంది. మాలీవుడ్లో వ్యవస్థీకృతంగా మారిన లైంగిక వేధింపుల గురించి ఆ కమిటీలో సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలోనే మరింత మంది ఇండస్ట్రీ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దల గుట్టును బయటపెట్టారు. మలయాళలో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధిఖ్ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు, మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవిని వదులుకున్నారు. ఇటీవలే బెంగాలి నటి శ్రీలేఖ మిత్ర.. తనతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు రావడం.. ఖండించి ఊరుకోవడం మామూలే కానీ.. ఇలా పెద్ద పదవుల్లో ఉన్న ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రావడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on August 26, 2024 6:21 pm
యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య…
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…