Trends

మూడో పెళ్లి చేసుకుంటారా.. ఆమిర్ బదులేంటి?

బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన, అలాగే  గౌరవనీయ వ్యక్తుల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఒక సమయంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్న్నాడు ఆమిర్. కానీ ఆయన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. తన తర్వాతి చిత్రంతో ఆమిర్ బలంగా పుంజుకుంటాడని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఇక ఆమిర్ వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుంటుంది.

రీనా దత్తాను వివాహమాడి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆమిర్.. తర్వాత ఆమె నుంచి విడిపోయి కిరణ్ రావును పెళ్లాడాడు. దాదాపు దశాబ్దం పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆమె నుంచి కూడా ఆమిర్ విడిపోయాడు. కానీ కిరణ్ నుంచి విడిపోయాక కూడా ఆమెతో కలిసి సినిమాల కోసం పని చేస్తుండడం విశేషం. మరి ఆమిర్ కొత్తగా మరో పెళ్లి చేసుకుంటాడా అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. ఈ ప్రశ్నకు బదులివ్వడంతో పాటు తన మాజీ భార్యలతో సంబంధాల గురించి ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

‘‘వైవాహిక జీవితంలో నేను రెండుసార్లు విఫలమయ్యాను. కాబట్టి ఎవరైనా పెళ్లి గురించి నన్ను సూచనలు అడక్కపోవడం మంచిది. ఒక బంధం సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనం చెప్పలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నిజానికి నాకు ఒంటరిగా జీవించడం ఇష్టముండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలనే కోరుకుంటా. ఒకరితో కలిసి ఉ:డడం.. కష్టసుఖాలు పంచుకోవడం నాకిష్టం. కానీ కొన్ని కారణాల వల్ల నా వైవాహిక బంధాలు నిలబడలేదు.

కానీ నా మాజీ భార్యలు రీనా, కిరణ్ ఇద్దరితోనూ నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం. నాకిప్పుడు 59 ఏళ్లు. ఈ వయసులో మళ్లీ పెళ్లి అంటే కష్టంగా ఉంటుంది. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, స్నేహులతో రీకనెక్ట్ అవుతున్నాను. నాకెంతో ఇష్టమైన సమయాన్ని వారితో ఆస్వాదిస్తున్నా. అందుకు ఆనందంగా ఉన్నాను. అందరికీ నచ్చేలా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని ఆమిర్ చెప్పాడు.

This post was last modified on August 26, 2024 6:22 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

3 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

20 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

42 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago