Trends

స‌ర్కారుకు హైడ్రా నివేదిక‌.. సంచ‌ల‌న విష‌యాలు ఇవీ!

గ‌త కొన్నాళ్లుగా హైద‌రాబాద్ లో ఆక్ర‌మ‌ణ దారుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్న హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మేనేజ్‌మెంట్‌, ప్రొటెక్ష‌న్ ఏజేన్సీ(హైడ్రా) తాజాగా ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ ర్పించింది. గ‌త జూన్ 27వ తేదీన రంగంలోకి దిగిన హైడ్రా ప‌లు అక్ర‌మ క‌ట్టడాల‌ను కూల్చి వేయ‌డంతో పాటు.. ఆక్ర‌మిత స్థ‌లాల‌ను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన నివేదిక‌ను హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ రంగ‌నాథ్ స‌ర్కారుకు అందించారు. నివేదిలో పేర్కొన్న‌ వివ‌రాలు ఇవీ..

సినీ ఇండ‌స్ట్రీలో..

+ ఫిల్మ్‌నగర్‌ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో ఆక్ర‌మ‌ణ‌కు గురైన  16 గుంటలు స్వాధీనం.

+  ఫిల్మ్ నగర్‌లోని బీజేఆర్ నగర్‌లో 5 ఎకరాలు స్వాధీనం.

+ అమీర్‌పేట, చందానగర్‌ల‌లో 16 గుంటల స్థలం స్వాధీనం.

+ బాచుపల్లిలో 29 గుంటలు, బోడుప్పల్‌ లో 3 గుంటలు స్వాధీనం.

ఇత‌ర ప్రాంతాల్లో..

+  18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

+ 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

+ చెరువులు, బ‌ఫ‌ర్ జోన్ల ఆక్ర‌మ‌ణ‌లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నారు.

+ చింతల్ చెరువును ఆక్ర‌మించిన బీఆర్ ఎస్ నేత‌ రత్నాకరం సాయిరాజుకు చెందిన 54 భ‌వ‌నాల‌ కూల్చివేత‌. త‌ద్వారా.. 3 ఎకరాల 5 గుంటల స్థలం స్వాధీనం.

+ ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 18 గుంటల భూమి స్వాధీనం.

+ బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లోని బుమురౌఖ్‌ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదంతస్తుల భవనాలు, ఒకటి రెండంతస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని కూల్చివేశారు.

+ బ‌హదూర్ పురాలో 12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం.

ప్ర‌ముఖుల‌కు చెందిన‌వి కూడా..

+ గండిపేటలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, ప్రోకబడ్డి యజమాని అనుపమ ఆక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేశారు.

+ మాదాపూర్‌లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత‌, 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం. 

This post was last modified on August 26, 2024 1:52 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

53 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago