సౌదీ అల్ హసాలో టవర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న షహబాజ్ ఖాన్ (27) అనే తెలంగాణ కరీంనగర్ కు చెందిన యువకుడు ఎడారిలో జీపీఎస్ పనిచేయక తప్పిపోయి చనిపోయాడు. తనతో పాటు ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా చనిపోయాడు.
5 రోజుల క్రితం తనతోపాటు ఉండే వ్యక్తితో కారులో బయటకు వెళ్లారు. జీపీఎస్ లేక దారి తప్పి రబ్ అల్ ఖలీ అనే ప్రమాదకరమైన ఎడారిలోకి వెళ్లారు. కారులో పెట్రోల్ అయిపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడం విపరీతమైన ఎండలకు డీహైడ్రేషన్ బారినపడి ఇద్దరూ చనిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates