ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉండే కొండాపూర్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది విదేశీ అమ్మాయిలు ఒకే ప్లాట్ లో ఉండటం.. వారిపై తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు.
కొండాపూర్ లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వీరు చేస్తున్న వ్యభిచారం పూర్తిస్థాయి హైటెక్ రీతిలో ఉందంటున్నారు. కొన్ని చెత్త వెబ్ సైట్లలో..మీకు సమీపంలోనే అమ్మాయిలు ఉన్నారంటూ మెసేజ్ లు పంపుతుంటారు. అలా ఆకర్షిస్తూ. . ఆన్ లైన్ లోనే బేరసారాల్ని పూర్తి చేసే విధానాన్ని వీరు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందుకోసం విదేశాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి.. కొంతకాలం వారిని ఇక్కడ ఉంచేసి తిరిగి పంపుతారన్నట్లుగా తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 17 మంది విదేశీ అమ్మాయిలు రెండు దేశాలకు చెందిన వారిగా తెలుస్తోంది. వీరిని సేఫ్ హౌస్ కు తరలించారు. తదుపరి విచారణ జరపాల్సి ఉంది.
వీరు ఏ పని మీద మన దేశానికి వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? వీరిని ఎవరైనా ట్రాప్ చేశారా? వీరి వెనుక ఉన్న వారెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఒక వ్యభిచార రాకెట్ లో ఒకేసారి ఇంత మంది విదేశీ అమ్మాయిలు దొరకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
ఈ మొత్తానికి బాధ్యుడిగా శివకుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. అతడితో పాటు.. ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 25 హెచ్ఐవీ పరీక్ష కిట్లు.. హుక్కా పాట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
This post was last modified on August 23, 2024 12:12 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…