ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరిలోకి చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దురదృష్టంకొద్దీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రియాక్టరు పేలుడు సమయంలో ఆమె అసలు విధుల్లోనే ఉండాల్సింది కాదు.
మూడు రోజుల కిందటే తన పెదనాన్న కొడుకైన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఆమె అచ్యుతాపురం నుంచి కాకినాడకు వచ్చింది. తన అన్నకు రాఖీ కట్టిన వీడియోను రీల్‌గా కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టారు. రాఖీ కోసం ఇటికి వచ్చిన హారికను ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉండాలని కోరారట కుటుంబ సభ్యులు. కానీ ఆమె మాత్రం రాఖీ తర్వాతి రోజు మాత్రమే అక్కడ ఉండి.. విధులకు హాజరు కావాల్సిందే అంటూ ప్రమాద ఘటన రోజు అచ్యుతాపురానికి వచ్చేసింది.
కెమికల్ ఫ్యాక్టరీలో విధులకు హాజరైంది. కానీ మృత్యువు రియాక్టర్ పేలుడు రూపంలో ఆమెను వెంటాడింది. రెండు రోజుల ముందు అన్నకు రాఖీ కట్టి ఎంతో సంతోషంగా ఉన్న హారిక.. ఇప్పుడిలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో అందరి గుండె బరువు చేస్తోంది. హారిక ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాపీ మేస్త్రిగా పని చేసే తండ్రి హారిక చిన్నతనంలోనే చనిపోగా.. సోదరుడు చిన్నపుడే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లి, నానమ్మ సంరక్షణలో పెరిగిన హారిక ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ప్రమాదం జరిగిన ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందింది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన హారిక.. పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. వాళ్లు మరొక్క రోజు ఉండమన్నా.. సెలవు దొరక్కపోవడంతో విధులకు వెళ్లి మృత్యువాత పడింది.
This post was last modified on August 23, 2024 7:57 am
నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన…
ముంబై పేలుళ్లు, భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడులను లైవ్లో పర్యవేక్షించినట్టు ఆరోపణలు ఉన్న.. మోస్ట్ వాంటెడ్ ఐసిసి ఉగ్రవాది.. ఇస్లామిక్…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సమావేశాల్లో మూడో రోజైన శనివారం సభ ప్రారంభం కాగానే… గవర్నర్ ప్రసంగంపై…
తెరమీద ఇండియన్ సూపర్ హీరోస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు క్రిష్. హృతిక్ రోషన్ హీరోగా ఆయన తండ్రి రాకేష్…
రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు జడలు విప్పుతున్నాయి. మొన్నటికి మొన్న నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరగగా.. తాజాగా…
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం.. అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గురించిన ప్రస్తావన వచ్చింది.…