Trends

విజయ్ పార్టీపై.. ఓ ముద్ర పడిపోనుందా?

సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం.. సొంతంగా పార్టీ పెట్టడం అత్యధిక స్థాయిలో జరిగే రాష్ట్రం తమిళనాడే. మన కంటే కూడా అక్కడ రాజకీయాల్లో సినీ స్టార్ల ఆధిపత్యం ఎక్కువ. సినీ రంగం నుంచి వచ్చిన కరుణానిధి, జయలలితలే అక్కడ సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజకీయాలను శాసించారు. వీరి బాటలో విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లు సైతం రాజకీయాల్లోకి వచ్చారు కానీ.. అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేదు. విజయ్ కాంత్ కొన్నేళ్లయినా ప్రభావం చూపాడు కానీ.. కమల్ పూర్తిగా తేలిపోయాడు.

ఇక రజినీకాంత్ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించాడు. ఐతే ఇప్పుడు తమిళంలో నంబర్ వన్ స్టార్‌గా ఎదిగిన విజయ్ రాజకీయారంగేట్రం చేయబోతున్నాడు. ఆల్రెడీ ‘తమిళ వెట్రి కళగం’ అనే పేరుతో విజయ్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

పార్టీని ప్రకటించాక హడావుడి పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు విజయ్. ఈ క్రమంలోనే విజయ్ తాజాగా తన పార్టీ జెండాను, అలాగే జెండా గీతాన్ని ఆవిష్కరించారు. పసుపు, ముదురు ఎరుపు రంగులతో ఉన్న ఈ జెండాలో రెండు ఏనుగులతో పాటు.. నక్షత్రాల మధ్య నెమలి ఉండేలా డిజైన్ చేశారు. ఐతే ఈ జెండాలో అందరి దృష్టినీ ఆకర్షించింది ప్రధానంగా ఆ రెండు ఏనుగులే.

ఒకప్పుడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తన పార్టీ కోసం ఏనుగు సింబల్‌ను ఎంచుకున్నారు. అందుకు అప్పట్లో ఆయనో సూత్రీకరణ కూడా చెప్పారు. ఇప్పుడు తన పార్టీ జెండాలో ఏనుగులను పెట్టడం ద్వారా తాను అంబేదర్కర్ అడుగు జాడల్లో నడవబోతున్నట్లు విజయ్ చెప్పకనే చెప్పారు. క్రిస్టియన్ అయిన విజయ్‌కి దళితుల్లో విశేషమైన ఆదరణ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

తన పార్టీ జెండాను ఇలా రూపొందించడం ద్వారా వెనుకబడిన వర్గాలను తన వైపు తిప్పుకునేలా విజయ్ ప్లాన్ చేశారని భావిస్తున్నారు. కానీ దీని వల్ల ఆయన మీద ఒక ముద్ర పడిపోయి అందరివాడు కాకుండా పోతాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 22, 2024 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ చరణ్ వదిలేసుకున్న సినిమా ఏదీ

నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్…

20 minutes ago

ఏపీ ఎవరి జాగీరు కాదండి: ముద్రగడ

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ…

22 minutes ago

‘పుష్ప-2’ మీద కోపం ‘గేమ్ చేంజర్’పై చూపిస్తున్నారు

‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…

1 hour ago

తిరుమల మృతులకు రూ.25 లక్షల పరిహారం

తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…

1 hour ago

ఆన్ లైన్ కోటా ఉండగా టోకెన్ల పంపిణీ ఎందుకూ…?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…

2 hours ago

భలే కబుర్లు చెప్పుకున్న డాకు – రామ్

అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…

3 hours ago