తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ. కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న వేళ.. దీనిపై ఇప్పటివరకు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా పెదవి విప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు.
ఎనిమిది నెలల క్రితం తన మిత్రుడి నుంచి తాను లీజుకు ఫామ్ హౌస్ తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ.. సదరు ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేసినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తానే తన స్నేహితుడికి చెబుతానని.. కూల్చివేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
కాకుంటే.. తమ ఫామ్ హౌస్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల ఫామ్ హౌస్ లపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్.
జన్వాడ భూములన్నీ కేటీఆర్ వేనని.. అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని చెబుతున్నారు. సర్వే నంబర్లతో సహా ఆధారాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫామ్ హౌస్ తన స్నేహితుడదని కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది కేటీఆర్ దేనని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ చుట్టు ఉన్న భూములు కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నట్లుగా అధికారులు నివేదికలు ఇచ్చినట్లుగా వెల్లడించారు.
కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జన్వాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తమ వద్ద సర్వే నంబర్లతో సహా వివరాలు ఉన్నట్లుగా మహేశ్ కుమార్ గౌడ్ చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతకు సంబంధించి.. నిబంధనలకు ప్రకారమే వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 22, 2024 1:32 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…